మహారాష్ట్ర జల్నా జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు (Bank Robbery in India). అంబాద్ తాలూకా షాఘడ్లోని బుల్దానా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్‌లోకి గురువారం సాయంత్రం సాయుధులైన దొంగలు ప్రవేశించారు. అక్కడి సిబ్బందిని తుపాకులతో బెదిరించి సుమారు రూ.1.25 కోట్ల విలువైన నగలు, నగదు దోచుకెళ్లారు.
"సాయంత్రం 5 గంటల సమయంలో ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు బ్రాంచ్‌లోకి ప్రవేశించారు. తుపాకులు చూపిస్తూ సిబ్బందిని బెదిరించారు. మా అందరి ఫోన్లను లాక్కుని స్ట్రాంగ్‌రూమ్‌లో పడేసి తాళం వేశారు. రూ.25 లక్షల నగదు, కోటి రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో ఉడాయించారు."
--బ్యాంకు సిబ్బంది
ఈ బ్రాంచ్‌లో సెక్యూరిటీ గార్డు లేడని.. కేవలం ఎనిమిది నిమిషాల్లో దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు జల్నా, బీడ్, ఔరంగాబాద్ జిల్లాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జిల్లా ఎస్పీ వినాయక్ దేశ్‌ముఖ్, అదనపు ఎస్పీ విక్రాంత్ దేశ్‌ముఖ్, స్థానిక క్రైమ్ బ్రాంచ్ చీఫ్ సుభాష్ భుజంగ్లు ఘటనా స్థలాన్ని సందర్శించారు.
ఇవీ చదవండి: