దేశంలో కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒక్కరోజే 42,582 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 52లక్షల 69వేల 292కు చేరింది. కొత్తగా 850 మరణాలు సంభవించగా.. కొవిడ్ మృతుల సంఖ్య 78,857కు చేరింది.
కేరళలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా మరో 39,955 మంది వైరస్ బారిన పడ్డారు.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
- కర్ణాటకలో కొత్తగా 35, 297 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి ధాటికి మరో 344 మంది మరణించారు.
- తమిళనాడులో ఒక్కరోజులో 30,621 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. కొవిడ్‌తో మరో 297 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఉత్తర్ ప్రదేశ్‌లో 17,775 కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి 281 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మధ్యప్రదేశ్‌లో కొత్తగా 8, 419 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 74 మంది మృతిచెందారు.
- రాజస్థాన్‌లో 15,867 కేసులు నమోదు కాగా.. మరో 159 మంది వైరస్‌కు బలయ్యారు.
- గోవాలో కొత్తగా 2,266 పాజిటివ్ కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి.
ఇదీ చదవండి : ఆ ఆస్పత్రిలో మరో 15 మంది కొవిడ్ రోగులు మృతి