Fire at a Chemical Company: మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లోని ఖొపోలీలో ఉన్న ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఖొపోలీలోని ముంబయి-పుణె పాత రహదారిపై ఉన్న ఆల్టా ఫార్మాసుటికల్ కంపెనీలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఈ మెథోల్ ప్లాంట్‌లోని 8 రియాక్టర్లూ ధ్వంసమయ్యాయి. తక్కువ వ్యవధిలోనే మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది.
4 నుంచి 5 కి.మీల మేర పొగకమ్ముకోవడం వల్ల స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అగ్నిమాపక వాహనాలను తరలించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అధికారులు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి: ఓడలో అగ్నిప్రమాదం.. వేలాది లగ్జరీ కార్లు బూడిద!