Madhya Pradesh Pregnant Lady: మధ్యప్రదేశ్ బుందేల్ఖండ్ వైద్య కళాశాలలోని డాక్టర్లు గర్భిణీకి అరుదైన శస్త్రచికిత్స చేశారు. సాగర్ జిల్లా సనోధా గ్రామానికి చెందిన గర్భిణీ ప్రసవం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అయితే ఆమెకు ఎలాంటి నొప్పులు రాకపోవడం, శిశువు ఎటూ కదలకపోవడం గమనించిన వైద్యులు అనుమానంతో ఆమెను బుందేల్ఖండ్ వైద్య కళాశాలకు పంపించారు.
గర్భిణీకి సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు.. ఆమె గర్భాశయం నుంచి అరకిలో బరువున్న రాయిని తొలగించారు. రాయి పొడవు 10 సెంటీమీటర్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత శిశువును సురక్షితంగా బయటకు తీశామన్నారు.
ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు డాక్టర్ దీప్తి గుప్తా తెలిపారు. ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు వెయ్యిమందిలో ఒక్కరికి జరుగుతుంటాయన్నారు.
ఇదీ చూడండి: కొనఊపిరితో చిన్నారి.. పనిచేయని ఆక్సిజన్ యంత్రం.. డాక్టర్ ఐడియాతో...