ETV Bharat / bharat

భూకబ్జా కేసులో విచారణకు 'శివుడు'.. రిక్షాలో కోర్టుకు..

Lord Shiva Gets Notice: భూఆక్రమణ ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు తాఖీదులు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం విచారణకు హాజరయ్యాడు మహాశివుడు. ఈ సంఘటన ఛత్తీస్​గఢ్​లోని రాయ్​గఢ్​లో జరిగింది. శివుడితోపాటు నోటీసులు అందుకున్న మరో 9 మంది విచారణకు హాజరయ్యారు.

Lord Shiva Gets Notice
కోర్టుకు శివుడు
author img

By

Published : Mar 25, 2022, 6:56 PM IST

విచారణకు హాజరైన మహా శివుడు

Lord Shiva Gets Notice: మీరు ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ అధికారులు సాక్షాత్తూ మహాశివుడికే ఛత్తీస్​గఢ్​ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసు విచారణలో భాగంగా రాయ్​గఢ్​ తహసీల్​ కోర్టుకు హాజరయ్యారు మహాశివుడు. శివుడితో పాటు నోటీసులు అందుకున్న 9 మంది.. ఇలా గుడిలోని శివలింగాన్ని తమ వెంట రిక్షాలో తెచ్చి.. విచారణకు హాజరయ్యారు.

భూకబ్జాపై మార్చి 15న నోటీసులు: "మీరు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ఛత్తీస్​గఢ్​ రెవెన్యూ కోడ్​-1959లోని సెక్షన్ 248 ప్రకారం ఇది నేరం. ఇలా చేసినందుకు మిమ్మల్ని ఆ భూమి నుంచి బలవంతంగా ఖాళీ చేయించవచ్చు. రూ.10వేలు జరిమానా విధించవచ్చు."... సాక్షాత్తూ మహాశివుడికి ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వ అధికారులు మార్చి 15న నోటీసులు పంపారు. శివుడితోపాటు దాదాపు 10 మందికి ఇదే తరహాలో తాఖీదులిచ్చారు. ఈనెల 25 జరిగే విచారణకు హాజరుకాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలా పరమేశ్వరుడికే వార్నింగ్ ఇచ్చే స్థాయిలో 'చట్టం తన పని తాను చేసుకుపోవడం' సర్వత్రా చర్చనీయాంశమైంది.

భగవంతుడు భూకబ్జా చేశాడా?: రాయ్​గఢ్​ 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే ఇటీవల బిలాస్​పుర్​ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆ భూమిలో ఉన్న శివాలయం సహా మొత్తం 16మందిని నిందితులుగా పేర్కొన్నారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, నిజానిజాలు ఏంటో తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే స్థానిక తహశీల్దార్ కార్యాలయం రంగంలోకి దిగింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి మూడు రోజులు విచారణ జరిపింది.

ప్రాథమిక విచారణలో తెలిసిన విషయాల ఆధారంగా చర్యలకు ఉపక్రమించారు తహశీల్దార్ కార్యాలయం అధికారులు. దాదాపు 10 మందికి నోటీసులు ఇచ్చారు. ఈనెల 25న జరిగే విచారణకు వచ్చి.. భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. విచారణకు హాజరుకాకపోతే.. చట్టప్రకారం చర్యలు(భూమిని ఖాళీ చేయించి, రూ.10వేలు జరిమానా) తప్పవని హెచ్చరించారు. నోటీసులు అందుకున్న వారిలో ఆరో వ్యక్తి.. శివుడు. నిజానికి.. శివాలయాన్ని నిందితుడిగా పేర్కొన్నారు పిటిషనర్. ఆ ప్రకారం చూసినా.. గుడి ధర్మకర్తకో, మేనేజర్​కో, అర్చకుడికో నోటీసులు ఇవ్వకుండా నేరుగా శివుడి పేరుతోనే పంపడం చర్చనీయాంశమైంది.

అప్పుడు వారు.. ఇప్పుడు వీరు: నేరుగా భగవంతుడికే ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో నీటి పారుదల శాఖ వారు ఇలానే చేశారు. జంజ్​గీర్​- చంపా జిల్లాలో కాలువ పక్కన ఉండే సర్వీస్​ రోడ్​ను ఆక్రమించిన కేసులో వివరణ ఇవ్వాలంటూ నేరుగా ఈశ్వరుడికే తాఖీదులు ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.