ETV Bharat / bharat

Land Forgery Case : 4.6 ఎకరాల భూమి కాజేయడానికి ప్లాన్​.. చనిపోయిన వ్యక్తి భార్య సంతకాలను ఫోర్జరీ చేసి..

Land Forgery Case In Uttar Pradesh : చనిపోయిన వ్యక్తి భార్య సంతకాలను ఫోర్జరీ చేసి దాదాపు నాలుగున్నర ఎకరాల భూమిని తమ పేరున రాయించుకున్నారు ఇద్దరు మహిళలు. దీని గురించి ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Land Sale Forgery Case In Uttar Pradesh
Land Sale Forgery Case In Uttar Pradesh
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 8:03 AM IST

Updated : Aug 27, 2023, 11:38 AM IST

Land Forgery Case In Uttar Pradesh : ఉత్తర్​ప్రదేశ్​.. మైన్​పురి జిల్లాలో చనిపోయిన వ్యక్తి భార్యలుగా నమ్మించి దాదాపు నాలుగున్నర ఎకరాల (4.6 ఎకరాలు) భూమిని తమ పేరున రాయించుకున్నారు ఇద్దరు మహిళలు. ఈ విషయం వెలుగులోకి రావడం వల్ల బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు మహిళలు సహా ఐదుగురిపై చీటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిష్ని పోలీస్ స్టేషన్​ పరిధిలోని బైరాగ్​పుర్ గ్రామంలో ప్రమోద్​ కుమారుడు జగదీశ్​ నివసిస్తున్నాడు. అతడి బాబాయి రామావతార్​ 2021 జనవరి 4న మరణించాడు. రామావతార్ భార్య ఇంద్రావతి ఇంకా బతికే ఉంది. ప్రస్తుతం ఆమె తన పుట్టింట్లో ఉంది. కాగా రామావతార్​కు దాదాపు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది.

అయితే ఆ భూమిని కాజేయాలని సాజ్ హాజీపుర్ పోలీస్​స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న రామ్ ప్రకాశ్​ భార్య హేమలత, శివలాల్ భార్య ఆర్తి పథకం​ వేశారు. వీరికి రామ్ ప్రసాద్ కుమారుడు ఓం ప్రకాశ్​, బైరాగ్​పుర్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని బెచెలాల్​ నివాసి వీరేంద్ర సింగ్​ కుమారుడు శ్యామ్ సింగ్​, ఖడ్సరియా అనే ముగ్గురు వ్యక్తులు​ సహాయం చేశారు. పథకంలో భాగంగా హేమలత, ఆర్తి.. రామావతార్​ భార్యలుగా తమ పేరును రిజిస్టర్ చేయించుకున్నారు.

అనంతరం రామవతార్​ భార్యలుగా సంతకాలు ఫోర్జరీ చేసి ఆ భూమిని తమ పేరున రాయించుకున్నారు హేమలత, ఆర్తి. అయితే తన బాబాయికి సంబంధించిన భూమిని అక్రమంగా ఇద్దరు మహిళలు చేజిక్కించుకున్నట్లు జగదీశ్​ దృష్టికి వచ్చింది. దీంతో జగదీశ్​ కిష్ని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కోర్టు ఆదేశానుసారం హేమలత, ఆర్తి సహా ఐదుగురిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

పెళ్లి కోసం ప్రధాని సంతకం ఫోర్జరీ..
పెళ్లి కోసం ప్రధాని నరేంద్ర మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడో వ్యక్తి. 2020లో జరిగిన ఘటనలో నిందితుడికి.. రాజస్థాన్​ అల్వార్​కు చెందిన ఓ అమ్మాయితో 2018లో పరిచయమైంది. ప్రధాని కార్యాలయం(పీఎంఓ)లో పనిచేస్తానంటూ నమ్మించి ఆమె కుటుంబ సభ్యులకు దగ్గరయ్యాడు. ప్రధాని మోదీ సంతకం ఉన్న ఓ అపాయింట్​మెంట్​ పత్రాన్ని కూడా చూపాడు. ఇదంతా నిజమని నమ్మిన కుటుంబ సభ్యులు వారమ్మాయిని ఇతనికిచ్చి వివాహం చేశారు. కానీ అతడో మోసగాడనే అసలు విషయం తర్వాత తెలుసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

forgery: తహసీల్దార్ సంతకాన్నే ఫోర్జరీ చేశాడు

పెళ్లి కోసం ప్రధాని మోదీ సంతకం ఫోర్జరీ

Last Updated : Aug 27, 2023, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.