దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరం సరికొత్త శోభను సంతరిచుకుంది. సరయు నదీ తీరం లక్షలాది దీపపు ప్రమిదల వెలుగుల మధ్య ధగధగలాడింది.
ఏటా దీపావళి ముందురోజు సరయూ నదీతీరంలోని రామ్‌కీ పౌడీ ఘాట్‌లో లక్షల దీపాలు వెలిగించి 'దీపోత్సవం' నిర్వహిస్తోంది ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.
అంతకుముందు 'సీతారాముల' పాత్రలు ధరించిన కళాకారులను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనంగా సత్కరించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. వారందరినీ సీఎం స్వయంగా హెలికాప్టర్లో లఖ్నవూ నుంచి అయోధ్యకు తీసుకురావడం విశేషం.
ఇవీ చదవండి: