ETV Bharat / bharat

శిథిలాల కుప్పతో రిషిగంగకు మరో ముప్పు!

ఉత్తరాఖండ్​కు మరో పెను ముప్పు పొంచి ఉంది. ఆకస్మిక వరదలతో రిషిగంగ నదీ ముఖద్వారం వద్ద కుప్పలుగా పేరుకుపోయిన వ్యర్థాలు, శిథిలాలతో నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడిందని, ప్రభుత్వం త్వరగా మేల్కోకపోతే మరో విపత్తును చూసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు గఢ్వాల్​ యూనివర్సిటీ ప్రొఫెసర్​ నరేశ్​ రాణా. అయితే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులు అప్రమత్తంగా ఉన్నారని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​.

author img

By

Published : Feb 12, 2021, 1:35 PM IST

Updated : Feb 12, 2021, 3:07 PM IST

Lake formed at Rishiganga mouth, threat looms large
శిథిలాల కుప్పతో రిషిగంగకు పొంచి ఉన్న మరో ముప్పు!

ఉత్తరాఖండ్ చమోలీలో హిమనీనదం విస్ఫోటనం సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే ఉత్తరాఖండ్​లో మరో ఉపద్రవం పొంచి ఉంది. ఫిబ్రవరి 7న ఆకస్మిక వరదల అనంతరం.. రిషిగంగ నదీ ముఖద్వారం వద్ద శిథిలాలు కుప్పలుతెప్పలుగా చేరాయి. రిషిగంగ నదీ ముఖద్వారం వద్దకు చేరిన గఢ్వాల్​ యూనివర్సిటీ ప్రొఫెసర్​ నరేశ్​​ రాణా ఈ విషయాన్ని వెల్లడించారు. సంబంధిత దృశ్యాల్ని వీడియోలుగా చిత్రీకరించి వివరాలు పంచుకున్నారు.

రిషిగంగ నదీ ముఖద్వారం వద్ద ప్రొఫెసర్​ నరేశ్​ రాణా

పేరుకుపోయిన శిథిలాలు.. నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా అక్కడ పెద్ద సరస్సులా ఏర్పడిందని రాణా వివరించారు. ఇది మరో విపత్తుకు దారి తీసే ప్రమాదం ఉన్నందున.. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఆ శిథిలాలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

రిషిగంగ నదీ ముఖద్వారం

సమాచారం ఉంది: సీఎం

జోషీమఠ్​లోని రైనీ గ్రామం వద్ద ఏర్పడిన నీటి మడుగు గురించి సమాచారం ఉందని తెలిపారు ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​. అయితే.. ఆందోళన చెందాల్సిన పనిలేదని, అప్రమత్తంగా వ్యవహరిస్తే చాలని ఆయన స్పష్టం చేశారు. ఏం చేయాలో ప్రస్తుతం శాస్త్రవేత్తలు సమీక్షిస్తున్నారని, వేరే నిపుణులను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఉత్తరాఖండ్​ జలవిలయం ధాటికి ఇప్పటివరకు 36 మంది మరణించారు. మరో 170 మందికిపైగా ఆచూకీ గల్లంతైంది. దాదాపు 600 మందికి పైగా ఎన్​డీఆర్​ఎఫ్​, ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యల్లో ఉన్నారు.

ఇదీ చూడండి:

యుద్ధప్రాతిపదికన 'ఆపరేషన్​ తపోవన్​'

ఆ అణు పరికరం జాడ కనిపెట్టాలని ప్రధానికి వినతి

Last Updated : Feb 12, 2021, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.