Ladies First Two Wheeler Workshop In Kerala : పూర్తిగా మహిళలే నడిపించే తొలి మెకానిక్ షాప్ కేరళలో ఏర్పాటైంది. కాసర్గోడ్ జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు రాష్ట్రంలోనే తొలి మహిళా బైక్ మెకానిక్ షాప్‌ను పెట్టి చరిత్ర సృష్టించారు. వెస్ట్ ఎలేరి పంచాయతీకి చెందిన బింటో, బిన్సీ, మెర్సీ.. 'కుటుంబశ్రీ వనితా టూ వీలర్ వర్క్ షాప్' పేరుతో దీన్ని ప్రారంభించారు. బైక్స్‌ను రిపేర్ చేయించుకునేందుకు చాలా మంది వాహనదారులు ఇక్కడికి వస్తున్నారు.
కుటుంబశ్రీ ఆర్‌కేఐ ఎంటర్ప్రెన్యుర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఆర్కేఐఈడీపీ) కింద తొమ్మిది మంది మహిళలు బైక్ రిపేర్ వర్క్‌లో శిక్షణ పొందారు. వారిలో బింటో, బిన్సీ, మెర్సీ.. కుటుంబశ్రీ సాయంతో వెస్ట్ ఎలేరిలోని కలికదావులో వర్క్‌షాప్‌ను మంగళవారం ప్రారంభించారు. బైక్‌కు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా రిపేర్ చేసి ఇస్తున్నారు. ప్రారంభమైన మొదటిరోజే ఈ రిపేర్ షాప్‌నకు మంచి స్పందన వచ్చింది. మహిళల పనితీరు పట్ల వాహనదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
"ప్రస్తుతానికి ద్విచక్ర వాహనాలను మాత్రమే రిపేర్ చేస్తున్నాం. మేము త్వరలోనే త్రీవీలర్, ఫోర్ వీలర్ వర్క్‌షాప్‌ను ప్రారంభిస్తాం. అలానే ఈ పని చేయడానికి ఆసక్తి ఉన్న మహిళలకు కుటుంబశ్రీ ప్రోగ్రామ్ కింద శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం" అని బింటో, బెన్సీ, మెర్సీ తెలిపారు. తమ షాప్ ప్రారంభించడానికి కావాల్సిన పరికరాలను కుటుంబశ్రీ మిషన్ కింద అధికారులు ఉచితంగా అందించారని చెప్పారు మహిళలు. కొంత కాలం తర్వాత వీటిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత వాటిని కొనుగోలు చేసేందుకు రుణాలు ఇస్తారని ముగ్గురు మహిళలు పేర్కొన్నారు.
ఉమెన్స్ డే స్పెషల్- అంబులెన్స్‌కు తొలి మహిళా డ్రైవర్
First Women Ambulance driver: మారుతున్న కాలంలో పురుషులతో సమానంగా సత్తా చాటుకుంటున్నారు మహిళలు. అవని నుంచి అంతరిక్షం వరకు దేనిలోనూ తీసిపోమంటూ సై అంటున్నారు. అదే క్రమంలో అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలపడంలో కీలక పాత్ర పోషించే అంబులెన్స్‌కు డ్రైవర్‌గా పని చేసేందుకు సిద్ధమయ్యారు ఓ కేరళ మహిళ. మహిళా దినోత్సవం రోజునే ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. కేరళలో ప్రభుత్వ అంబులెన్స్‌కు ఈమె మొదటి మహిళా డ్రైవర్ కావడం విశేషం. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
భర్త మరణంతో ఒంటరై.. కష్టపడి బస్సు డ్రైవరై.. ఆదర్శంగా ప్రియాంక ప్రయాణం!