ETV Bharat / bharat

మలయాళంలో కుడి నుంచి ఎడమకు రాసి రికార్డ్​ - మిర్రర్​ రికార్డ్​

కేరళకు చెందిన 44ఏళ్ల మహిళ అరుదైన రికార్డును నెలకొల్పారు. మలయాళంలో కుడి నుంచి ఎడమ(మిర్రర్​ రైటింగ్​)కు విరామం లేకుండా గంట 16 నిమిషాల పాటు రాసి ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించారు.

Kerala woman enters Indian records book for mirror writing
మలయాళంలో కుడి నుంచి ఎడమకు రాసి రికార్డ్​
author img

By

Published : Mar 4, 2021, 6:30 AM IST

మలయాళంలో కుడి నుంచి ఎడమకు రాసి రికార్డ్​

కేరళ కాసర్​గోడ్​ జిల్లాకు చెందిన కే లలిత.. మిర్రర్ రైటింగ్​లో అరుదైన రికార్డు సాధించారు. విరామం లేకుండా మలయాళంలో కుడి నుంచి ఎడమకు రాసి ప్రఖ్యాత ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సంపాదించారు.

లాక్​డౌన్​లో సాధన

లాక్​డౌన్​ సమయంలో లలితకు ఆమె పిల్లలు మిర్రర్​ రైటింగ్​ ఆలోచన చెప్పారు. అప్పటి నుంచి రోజూ సాధన చేశారు. కొద్ది కాలంలోనే అత్యంత కష్టమైన మిర్రర్​ రైటింగ్​ను అలవోకగా, వేగంగా రాయటం నేర్చుకున్నారు. భారత్​లోని అన్ని రాష్ట్రాల, 700పైగా ఉన్న జిల్లాల పేర్లను మలయాళంలో కుడి నుంచి ఎడమకు అలవోకగా రాస్తున్నారు.

తన భర్త, పిల్లల ప్రోత్సాహంతోనే తాను ఈ ఘనత సాధించానని లలిత తెలిపారు. భవిష్యత్​లో గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించటమే లక్ష్యంగా ముందుకెళ్తానని తెలిపారు.

ఇదీ చదవండి : సైకత శిల్పంతో వన్యప్రాణుల సంరక్షణా సందేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.