ETV Bharat / bharat

రైల్వేస్టేషన్‌లో టన్నెల్​ అక్వేరియం- దేశంలోనే తొలిసారి - aquarium in Bengaluru Railway Station

రైల్వే స్టేషన్‌కు ఎందుకు వెళతారు అని ఎవరినైనా అడిగితే రైళ్లెక్కేందుకు అని చెబుతారు. లేదంటే తమ వారిని రైలెక్కించడానికి లేదా తీసుకురావడానికి అని అంటారు. అయితే బెంగళూరు వాసులు ఇంకో మాట కూడా చెబుతున్నారు. రైల్వే స్టేషన్‌లో అక్వేరియం చూడడానికి వెళుతున్నామని అంటున్నారు. కాస్త వింతగా ఉన్నా ఇది నిజమే. దేశంలోనే రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన తొలి అక్వేరియం గురువారం ప్రారంభమైంది.

aquarium in Railway Station
రైల్వే స్టేషన్‌లో అక్వేరియం
author img

By

Published : Jul 1, 2021, 7:44 PM IST

బెంగళూరు రైల్వేస్టేషన్​లో ఏర్పాటు చేసిన సొరంగ అక్వేరియం

బెంగళూరు అంటే తోటలు, ఐటీ నగరంగా చెబుతారు. ఐటీ కార్యాలయాలు కొలువైన అద్దాల మేడలు, ఆహ్లాదపరిచే తోటలతో మనసుకు ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటుంది బెంగళూరు. అలాంటి నగర సిగలో మరో వన్నె చేరింది. దేశంలో రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన తొలి సొరంగ అక్వేరియం అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులోని క్రాంతివీర సంగోలి రాయన్న రైల్వే స్టేషన్‌లో గురువారం దీన్ని ప్రారంభించారు.

aquarium in Railway Station
రైల్వే స్టేషన్​లో సొరంగ అక్వేరియం

రైల్వే స్టేషన్‌కు వచ్చే వారికి మాత్రమే కాదు బెంగళూరు ప్రజలు, అక్కడికి విచ్చేసే పర్యాటకులను ఆకట్టుకునేందుకు బెంగళూరు కేఎస్​ఆర్ రైల్వే స్టేషన్‌లో ఈ సొరంగ అక్వేరియంను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్‌ అభివృద్ధి కార్పొరేషన్‌, హెచ్​ఎన్​ఐ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ సంయుక్తంగా దీనికి రూపకల్పన చేసింది.

aquarium in Railway Station
అక్వేరియంలో రకరకాల చేపలు

ఆకట్టుకునే రకరకాలైన చేపలు, తాబేళ్లు, పీతలు ఈ అక్వేరియంలో ఉంచారు. బ్లాక్‌ డైమండ్‌, స్టింగ్‌ రే, హై ఫిన్‌ షార్క్‌లు, సముద్రపు తాబేళ్లు, చుక్కల చేపలు, జెల్లీ చేప వంటివి ఇక్కడ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

aquarium in Railway Station
అక్వేరియంలో సరదాగా సందర్శకురాలు

బెంగళూరు కేఎస్​ఆర్ రైల్వే స్టేషన్‌లో రకరకాలైన మొక్కలను కూడా నాటారు. అమెజాన్‌ వర్షపు అడవుల నమూనా ఇక్కడి మరో ప్రత్యేకత. పిల్లల కోసం ఇక్కడ ప్రత్యేక సెల్ఫీ పాయింట్‌లను ఏర్పాటు చేశారు. ఈ అక్వేరియం ప్రవేశ రుసుము రూ.25. కనువిందు చేస్తున్న ఈ అక్వేరియం బెంగళూరుకు కొత్త గుర్తింపు తీసుకువస్తుందని అంటున్నారు అక్కడి నిర్వాహకులు.

aquarium in Railway Station
అక్వేరియంలో చేపలు

ఇదీ చూడండి: 'రైళ్లలో టికెట్​ లేకుండా 27 లక్షల మంది ప్రయాణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.