ETV Bharat / bharat

ఈటీవీ భారత్​ ఆఫీసులో సీఎం- రామోజీ రావుపై ప్రశంసలు

కర్ణాటక బెంగళూరులోని ఈటీవీ భారత్​ కార్యాలయాన్ని సందర్శించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై(cm bommai visits etv bharat office). డిజిటల్​ మీడియాలో ఈటీవీ భారత్​కు మంచి భవిష్యత్తు ఉందని, అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉండటం సంతోషకరమని అన్నారు(etv bharat kannada).

cm bommai visits etv bharat office
బసవరాజ్​ బొమ్మై
author img

By

Published : Nov 25, 2021, 4:04 PM IST

డిజిటల్​ మీడియాలో విప్లవం సృష్టిస్తున్న 'ఈటీవీ భారత్​'కు మంచి భవిష్యత్తు ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై అన్నారు(bommai latest news). దేశంలోని అన్ని భాషల్లోనూ ఈటీవీ భారత్​ అందుబాటులో ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు.

బెంగళూరులోని 'ఈటీవీ భారత్​' కార్యాలయాన్ని సందర్శించారు ముఖ్యమంత్రి బొమ్మై. డిజిటల్​ మీడియాకు సంబంధించిన అనేక విషయాలను ఆయనకు వివరించారు అక్కడి సిబ్బంది(etv bharat kannada).

"డిజిటల్​ మీడియాకు మంచి భవిష్యత్తు ఉంది. సామాన్యులు.. మొబైల్​ ద్వారా డిజిటల్​ మీడియాను సులభంగా యాక్సెస్​ చేయగలరు. వివిధ భాషల్లో యాప్​ను తీసుకురావడం చాలా మంచి విషయం. రామోజీ రావు దూరదృష్టి కలిగిన వ్యక్తి. దేశంలోని మీడియా వ్యవస్థలో ఆయన అనేక మార్పులు తీసుకొచ్చారు. ఆయన నేతృత్వంలోని ఈటీవీ భారత్​.. అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉండటం సంతోషంగా ఉంది."

-- బసవరాజ్​ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి.

కర్ణాటకలోనూ ఈటీవీ భారత్​ వేగంగా విస్తరిస్తోందని, రానున్న కాలంలో మరింత ఘన విజయాలను అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు బొమ్మై.

ఇవీ చూడండి:- భయం లేకుండా పనిచేయండి.. సీఎంకు మోదీ భరోసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.