కన్నడనాట మలుపులు తిరిగిన రాసలీలల సీడీ వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఈ సీడీలో ఉన్నట్లు భావించిన యువతి మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. వసంత నగరలోని 24 ఏసీఎంఎం కోర్టుకు హాజరై వాంగ్మూలమిచ్చారు. అనంతరం ఎస్‌ఐటీ అధికారుల ఎదుట కూడా ఈ యువతి మరోసారి వాంగ్మూలమిచ్చారు.
మాజీమంత్రి రమేశ్ జార్ఖిహొళితో పరిచయాలు, వీడియో చిత్రీకరణ, తల్లిదండ్రుల కిడ్నాప్ ఆరోపణ, తల్లిదండ్రులతో మాట్లాడుతున్న సందర్భంగా తీసిన వీడియో నకిలీదని చెప్పటం తదితరాలపై ఎస్‌ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: