ETV Bharat / bharat

Jayalalitha House: మేనకోడలి చేతికి జయలలిత నివాసం

Poes Garden Jayalalitha House: తమిళనాడులోని మాజీ సీఎం జయలలిత నివాసం అధికారికంగా ఆమె మేనకోడలు దీపా సొంతమైంది. శుక్రవారం.. చెన్నై కలెక్టర్​ ఆ భవనానికి చెందిన తాళాలను దీపాకు అందజేశారు.

jayalalitha
జయలలిత
author img

By

Published : Dec 10, 2021, 7:55 PM IST

Updated : Dec 10, 2021, 8:52 PM IST

Poes Garden Jayalalitha House: చెన్నైలోని పోయస్​గార్డెన్​లో ఉన్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసానికి చెందిన తాళాలను.. ఆమె మేనకోడలు దీపాకు అందజేశారు చెన్నై కలెక్టర్​. వేదనిలయంకు దీపా వారసురాలిగా పేర్కొంటూ గతనెల 24న మద్రాస్​ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. కలెక్టర్ శుక్రవారం ఈ తాళాలను అందించారు. దీంతో 'వేదనిలయం' అధికారికంగా దీప సొంతమైంది.

వేదనిలయంలోకి దీపా సహా ఆమె సోదరుడు దీపక్​లు అడుగుపెట్టారు.

"ఇది మాకు భారీ విజయం. మా మేనత్త ఇల్లు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా పుట్టిల్లు. ఇక్కడ మేనత్తతో గడిపిన క్షణాలన్నీ నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఆమె మరణించిన తర్వాత మళ్లీ ఈ ఇంట్లోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి."

-దీపా, జయలలిత మేనకోడలు

తాను ఈ ఇంటి హక్కులు పొందకుండా ఉండేందుకు పలువురు ప్రయత్నించారని ఆరోపించారు దీపా.

జయలలిత మరణించాక ఆమె నివాస హక్కులపై వివాదం చెలరేగింది. వేదనిలయాన్ని జయలలిత స్మారకంగా మార్చాలని అన్నాడీఎంకే నేతలు భావించారు. దీనిని వ్యతిరేకించిన జయలలిత మేనకోడలు జే.దీపా.. వారసులైన తమకే ఆ ఇల్లు దక్కాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు దీపాకు అనుకూలంగా గతనెల 24న తీర్పునిచ్చింది.

ఇదీ చూడండి : పిన్నీసులు విక్రయించే కుటుంబంపై వివక్ష- బస్సులోంచి దించేసి..!

Last Updated : Dec 10, 2021, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.