కరడుగట్టిన ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు (Jaish e mohammed news) సహకరిస్తున్న ముగ్గురు అనుచరులను జమ్ముకశ్మీర్ (Kashmir terror news) పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 43 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ నుంచి దక్షిణ కశ్మీర్‌కు డబ్బు తరలిస్తుండగా.. సిధ్రా బ్రిడ్జి వద్ద పట్టుబడ్డారు నిందితులు.
అరెస్టైన వారిని ఫయాజ్ అహ్మద్ దార్, ఉమర్ ఫరూక్, పర్వేజ్‌లుగా గుర్తించారు.
ఉగ్రముఠాలకు నిధులు సమకూరుస్తున్నట్లు తమకు అందిన సమాచారంతో ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు కశ్మీర్ పోలీస్ అధికారి చందన్ కోహ్లీ.
నాగ్రోటా వద్ద సోదాల్లో భాగంగా.. ఉగ్ర అనుచరులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపారు పోలీసులు. ఎక్కడివెళ్తున్నారని అడగగా.. వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అనుమానంతో పోలీసులు(Kashmir terror news).. బ్యాగ్‌లు తనిఖీ చేయగా పెద్దఎత్తున డబ్బు బయటపడింది.
జైషే మహ్మద్(Jaish e mohammed news) బృందానికే నగదును తరలిస్తున్నట్లు వారు ఒప్పుకున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: సరిహద్దులో పాక్ డ్రోన్ సంచారం- బీఎస్ఎఫ్ కాల్పులు