ETV Bharat / bharat

మూడో దశ క్లినికల్ ట్రయల్స్​కు జాన్సన్​ దరఖాస్తు - సీడీఎస్​సీఓ

తన సింగిల్ షాట్ కరోనా టీకాపై మూడో దశ క్లినికల్ పరీక్షలకు డీసీజీఐ అనుమతి కోరింది జాన్సన్ అండ్ జాన్సన్. దిగుమతి లైసెన్స్ జారీ చేయాలనీ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

Johnson & Johnson, single-shot COVID vaccine
జాన్సన్ & జాన్సన్, జాన్సన్ కరోనా టీకా
author img

By

Published : Apr 20, 2021, 8:33 AM IST

Updated : Apr 20, 2021, 9:37 AM IST

సింగిల్ డోసు కొవిడ్-19 వ్యాక్సిన్​ మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)ను అనుమతి కోరింది ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్​ జాన్సన్. అదే విధంగా ఇంపోర్ట్ లైసెన్స్​ జారీ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

ఈ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవడానికి త్వరితగతిన కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ(సీడీఎస్​సీఓ) నిపుణుల సమావేశం ఏర్పాటు చేయాలని జే అండ్​ జే కోరినట్లు తెలుస్తోంది. విదేశీ టీకాల అత్యవసర వినియోగానికి కావాల్సిన అనుమతులను మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విదేశీ సంస్థలు ఆ మేరకు దరఖాస్తు చేసుకుంటున్నాయి.

ఇదీ చూడండి: కరోనా బాధితుల కోసం కొత్త ఆక్సిజన్​ వ్యవస్థ

Last Updated : Apr 20, 2021, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.