ఇటీవల ఓటీటీ, డిజిటల్ మీడియాకు మార్గదర్శకాలు తీసుకొచ్చిన కేంద్రం.. తాజాగా ఓటీటీ, డిజిటల్ న్యూస్ పబ్లిషర్లతో సమావేశం ఏర్పాటు చేసింది. కొత్త నిబంధనలపై సమాచార మంత్రిత్వ శాఖ చర్చించింది. వీటిని సావధానంగా విన్న వారు నిబంధనలను స్వాగతించినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్పారు. మరికొన్ని సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో వారు చేసిన సూచనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
"ప్రజల నుంచి వస్తోన్న వినతులను పరిష్కరించడానికి కొత్త నిబంధనలను తీసుకువచ్చాం. ఫిర్యాదుల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశాం. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ కూడా కొంత ప్రాథమిక సమాచారాన్ని మంత్రిత్వ శాఖకు సరళమైన రూపంలో అందించాల్సిన అవసరం ఉంది. ఇలా ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను బహిరంగంగా వివరించాల్సి ఉంటుంది."
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర మంత్రి
వర్చువల్ విధానంలో సాగిన ఈ సమావేశానికి దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు అన్నీ హాజరయ్యాయి.