ETV Bharat / bharat

ఆ రెండు నగరాలకు 'స్మార్ట్​ సిటీస్​' అవార్డు - సూరత్​

స్మార్ట్​ సిటీస్​ నగరాల్లో మధ్యప్రదేశ్​లోని ఇందోర్​, గుజరాత్​లోని సూరత్​లు సంయుక్తంగా అవార్డు గెలుచుకున్నాయి. క్లైమెట్​ స్మార్ట్​ సిటీస్​ అసెస్​మెంట్​ ఫ్రేమ్​వర్క్​లో ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ, విశాఖపట్నం సహా మరో 7 నగరాలు 4 స్టార్​ రేటింగ్​ను​ సాధించాయి.

Smart City Award
స్మార్ట్ సిటీస్​గా ఇందోర్​, సూరత్​
author img

By

Published : Jun 26, 2021, 10:43 AM IST

స్మార్ట్​ సిటీస్​ కాంపిటీషన్​-2020 అవార్డును రెండు నగరాలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ శుక్రవారం ప్రకటించిన జాబితాలో.. మధ్యప్రదేశ్​లోని ఇందోర్​, గుజరాత్​లోని సూరత్​ పట్టణాలు అర్బన్​ కేటగిరీలో తొలిస్థానంలో నిలిచి.. అవార్డును గెలుచుకున్నాయి. రాష్ట్రాల జాబితాలో ఉత్తర్​ప్రదేశ్​కు ఈ గౌరవం దక్కింది. ఈ అవార్డులను కేంద్ర మంత్రి హర్దీప్​ సింగ్​ పూరీ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గ శంకర్​ మిశ్రాలు ప్రకటించారు.

Indore
ఇందోర్​

స్మార్ట్​ సిటీస్​ మిషన్​, అమృత్​, ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన-అర్బన్​ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఇండియా స్మార్ట్​ సిటీస్​ కాంపిటీషన్​-2020ని ఆన్​లైన్​ ద్వారా నిర్వహించింది కేంద్రం. ఈ మూడు మిషన్లను 2015, జూన్​ 25 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

జాబితాలోని మరిన్ని అంశాలు..

  • రాష్ట్రాల జాబితాలో ఉత్తర్​ప్రదేశ్​ తర్వాత.. మధ్యప్రదేశ్​, తమిళనాడు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఛండీగఢ్​కు అవార్డు దక్కింది.
  • స్మార్ట్​ సిటీస్​ లీడర్​షిప్​ అవార్డులో అహ్మదాబాద్​ తొలిస్థానంలో నిలవగా.. వారణాసి రెండు, రాంచీ మూడో స్థానాన్ని సాధించాయి.
  • క్లైమేట్​-స్మార్ట్​ సిటీస్​ అసెస్​మెంట్​ ఫ్రేమ్​వర్క్​లో 9 నగరాలు 4 స్టార్​ రేటింగ్​ సాధించాయి. అందులో సూరత్​, ఇందోర్​, అహ్మదాబాద్​, పుణె, విజయవాడ, రాజ్​కోట్​, వడోదర, విశాఖపట్నం, పిమ్రి-చింఛ్వాద్​లు ఉన్నాయి.

ఇదీ చూడండి: ఐదోసారి స్వచ్ఛ ర్యాంక్​పై కన్నేసిన 'ఇందోర్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.