ETV Bharat / bharat

'హింసకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు' - కేంద్రం ట్రాక్టర్ ర్యాలీ హింస

ట్రాక్టర్ ర్యాలీలో హింసకు బాధ్యులైన వారిని ఊరికే వదిలిపెట్టబోమని కేంద్రం హెచ్చరించింది. హింస జరగడానికి ప్రేరేపించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. జాతీయ పతాకాన్ని అవమానిచేలా చేసిన ఏ చర్యల్నీ దేశం ఉపేక్షించదని పేర్కొంది.

india-wont-tolerate-insult-of-national-flag-at-red-fort-says-centre
'హింసకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు'
author img

By

Published : Jan 28, 2021, 5:17 AM IST

జాతీయ పతాకాన్ని అవమానించే చర్యల్ని దేశం ఎప్పటికీ ఉపేక్షించదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ర్యాలీ హింసాత్మకంగా మారడాన్ని తీవ్రంగా ఖండించింది. దేశ రాజధానిలో చోటుచేసుకున్న హింసాత్మక చర్యలకు బాధ్యులైన వారిని ఊరికే వదిలిపెట్టబోమని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

"హింస జరగడానికి ఇతరుల్ని ప్రేరేపించిన ప్రతి ఒక్కరిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని అవమానించేలా చేసిన ఏ చర్యల్ని భారత్‌ ఉపేక్షించదు"

-జావడేకర్‌

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు జావడేకర్‌. ఈ హింసాత్మక ఘటనల వెనక కాంగ్రెస్‌ పార్టీ కుట్ర ఉందని జావడేకర్‌ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలను ఎల్లప్పుడూ రెచ్చగొట్టడానికే పనిచేసిందని ఆరోపించారు. ఈ ర్యాలీ ఘటనపై అభినందిస్తూ కొందరు కాంగ్రెస్‌ నాయకులు చేసిన ట్వీట్లను జావడేకర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి జనాధరణ పెరగడం తట్టుకోలేని ప్రతిపక్షాలు దేశం ప్రశాంతంగా లేకుండా.. హింస జరగాలని కాంక్షిస్తున్నాయని విమర్శించారు. కుటుంబ రాజకీయాల కోసం కొన్ని పార్టీలు చేస్తున్న పనులు ఆందోళన కలగజేస్తున్నాయని తెలిపారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు పరిష్కారం కాకూడదనే కాంగ్రెస్‌ కోరుకుంటోందని విమర్శించారు. ఆందోళనకారులు కత్తులు, రాళ్లతో దాడులకు పాల్పడినప్పటికీ.. ఎంతో సంయమనంతో విధి నిర్వర్తించిన దిల్లీ పోలీసులను ఆయన ప్రశంసించారు.

ఎర్రకోటపై రైతు జెండా

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. రైతులు ఎర్రకోటపై రైతు జెండాలను ఎగురవేశారు. ఈ ఘటనలో 300 మంది పోలీసులకు గాయాలైనట్లు దిల్లీ పోలీసు శాఖ వెల్లడించింది. ఘటనకు బాధ్యులుగా అనుమానిస్తున్న 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 'రైతులతో చర్చలకు ఇప్పటికీ సిద్ధమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.