దేశంలో కరోనా(Coronavirus update) కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 16,862 మందికి కరోనా (Coronavirus update) పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ ధాటికి(Covid cases in India) మరో 379 మంది మరణించారు. ఒక్కరోజే 19,391 మంది రికవరీ అయ్యారు.
- మొత్తం కేసులు: 3,40,37,592
- మొత్తం మరణాలు: 2,03,678
- మొత్తం కోలుకున్నవారు: 3,33,82,100
- యాక్టివ్ కేసులు: 4,51,814
పరీక్షలు
అక్టోబరు 14న 11,80,148 కరోనా పరీక్షలు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 58,88,44,673కు చేరింది.
టీకాల పంపిణీ
గురువారం ఒక్కరోజే 30,26,483 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 97,14,38,553కు చేరినట్లు చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 4,42,003 మందికి వైరస్ (Corona update) సోకింది. కొవిడ్ ధాటికి మరో 7,421 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,03,83,902కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,96,745కు పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 89,680 మందికి వైరస్ సోకింది. మరో 1,654 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
- బ్రిటన్‌లో క్రితం రోజుతో పోల్చుకుంటే కొవిడ్ కేసుల్లో కాస్త పెరిగాయి. కొత్తగా 45,066 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అయితే మరణాల సంఖ్య తగ్గింది. తాజాగా 157 మృతి చెందారు.
- టర్కీలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. ఒక్కరోజే 30,709 మందికి వైరస్ బారిన పడగా.. 203 మంది మరణించారు.
- రష్యాలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. తాాజాగా 31,299 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజే 986 మంది వైరస్ ధాటికి మృతి చెందారు.
- ఇరాన్లో కొత్తగా 11,964 మందికి కొవిడ్ సోకగా.. 223 మంది చనిపోయారు.
- బ్రెజిల్లో తాజాగా 14,288 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 558 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: బడి చదువులపై కరోనా పంజా