ETV Bharat / bharat

బైడెన్ ఆహ్వానాన్ని అంగీకరించిన మోదీ - భారత విదేశాంగ ప్రతినిధి

వాతావరణ మార్పులపై చర్చించే సదస్సుకు హాజరుకావాలనే అమెరికా ఆహ్వానాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

modi accepts bidens invitation
బైడెన్ ఆహ్వానాన్ని అంగీకరించిన మోదీ
author img

By

Published : Apr 2, 2021, 10:02 PM IST

వాతావరణ మార్పులపై చర్చించేందుకు పంపిన అమెరికా ఆహ్వానాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారని విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాతావరణ మార్పుల సమావేశానికి హాజరవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోదీని కోరారు. ఈ నేపథ్యంలో వర్చువల్​ వేదికగా ఏప్రిల్ 22-23న జరగనున్న సదస్సుకు హాజరుకానున్నారు మోదీ.

"వాతావరణ మార్పునకు సంబంధించి.. అమెరికా దౌత్యవేత్త జాన్ కెర్రీ ఏప్రిల్​ 5 నుంచి 8 వరకు దిల్లీ పర్యటించనున్నారు."

--అరిందమ్ బాగ్చి, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి.

భారత​ పర్యటనకు ముందు వాతావారణ మార్పులపై చర్చించేందుకు జాన్ కెర్రీ బంగ్లాదేశ్​, యూఏఈలో పర్యటించనున్నారు.

ఇదీ చదవండి:తైవాన్​ రైలు ప్రమాదం: 48కి పెరిగిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.