ETV Bharat / bharat

కొవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధిలో మార్పు

author img

By

Published : Mar 22, 2021, 3:35 PM IST

కొవిషీల్డ్ టీకా.. రెండు డోసుల మధ్య ఉండాల్సిన విరామాన్ని కేంద్రం సవరించింది. రెండు డోసుల మధ్య 4 నుంచి 8 వారాల వ్యవధి ఉండాలని తెలిపింది. ఇదివరకు ఈ వ్యవధి 4 నుంచి 6 వారాలుగా ఉండేది.

Covishield doses interval
కొవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధిలో మార్పు

సీరం ఇన్​స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య ఉండాల్సిన విరామాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. ప్రస్తుతం.. తొలి డోసు తీసుకున్న 4 నుంచి 6 వారాల తర్వాత రెండో డోసు ఇస్తున్నారు. తాజాగా ఈ సమయాన్ని '4 నుంచి 8 వారాల'కు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.

రెండు డోసుల మధ్య విరామానికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లభించిన తర్వాత నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్, కొవిడ్ టీకాపై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.

ఈ సవరణ కొవిషీల్డ్ టీకాకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్​కు దీనితో సంబంధం లేదని వివరించింది.

ఇదీ చదవండి: జనతా కర్ఫ్యూకు ఏడాది- మళ్లీ అదే పరిస్థితా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.