ఉత్తర్ప్రదేశ్ కోత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు హత్యాచారం చేశాడు.
నిందితుడు నివసించే ప్రాంతంలోనే బాలిక తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. తన ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని వెంట తీసుకెళ్లాడు ఆ యువకుడు. ఆ తర్వాత బాలికను రేప్ చేసి గొంతు కోశాడు. మృతదేహాన్ని తన ఇంట్లో బెడ్ కింద దాచిపెట్టాడు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు.
డిగ్రీ విద్యార్థినిపై..
ఒడిశా మయూర్గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిని ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. బైసింగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కలామా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
శుక్రవారం సాయంత్రం యువతి ఓ బాలునితో కలిసి వెళుతుండగా.. ముగ్గురు యువకులు వారిని అడ్డగించారు. ఆ బాలున్ని గాయపరిచి యువతిని అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలు డిగ్రీ చదువుతోంది. నిందితులు 22 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు వారని పోలీసులు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: నేరగాళ్లకు అత్తింటి మర్యాదలు