ETV Bharat / bharat

ఒంటి చేత్తో డ్రగ్స్​​ ముఠా ఖేల్​ ఖతం- హోంగార్డ్​కు భారీ ప్రమోషన్ - అసోం వార్తలు

లంచానికి ఆశ పడకుండా, డ్రగ్స్​ మాఫియాకు భయపడకుండా నిజాయితీగా పనిచేసిన ఓ హోం గార్డును పోలీసు కానిస్టేబుల్​గా నియమించింది అసోం ప్రభుత్వం. రూ.12 కోట్లు విలువ చేసే డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నందుకు పదోన్నతి కల్పించింది.

Assam
అసోం పోలీసు
author img

By

Published : Jun 27, 2021, 5:39 PM IST

నిజాయితీగా సేవలందించిన ఓ హోం గార్డుకు తగిన గుర్తింపునిచ్చింది అసోం ప్రభుత్వం. రూ.12 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సాహసించి స్వాధీనం చేసుకున్న జవాను బోర్సింగ్​ బేను రాష్ట్ర పోలీసు కానిస్టేబుల్​గా నియమించింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. ఆయనకు స్వయంగా నియామక పత్రాన్ని అందజేశారు.

Assam
హోం గార్డును అభినందిస్తున్న సీఎం హిమంత

ఏం జరిగిందంటే..

కొద్ది రోజుల క్రితం.. మణిపుర్​లోని ఇంఫాల్​ నుంచి గువాహటికి రాత్రి వేళ వస్తున్న బస్సులో ఒంటరిగా సోదా చేశారు బోర్సింగ్​. అందులో రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో లంచం ఇవ్వజూపినా.. ఆయన ఆశ పడలేదు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు.. బోర్సింగ్​కు పదోన్నతి కల్పించారు.

Assam
నియామకపత్రంతో బోర్సింగ్ బే

కల నేరవేరింది..

కానిస్టేబుల్​గా నియమించడం పట్ల బోర్సింగ్​ హర్షం వ్యక్తం చేశారు. 2002 నుంచి హోం గార్డుగా ఉన్న తను.. కానిస్టేబుల్​ పోస్టు కోసం పలు దఫాలు ఇంటర్వ్యూలకు హాజరైనట్లు తెలిపారు. తన సేవలను గుర్తించిన అసోం పోలీసు, సీఎం హిమంతకు కృతజ్ఞతలు చెప్పారు.

ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలో మంత్రులకు నయా 'రూల్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.