Petrol theft in Maharashtra: అక్రమ పెట్రోల్ విక్రయ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని బెల్తరోడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఖాప్రీ గ్రామంలో నివసిస్తున్న మీనా ద్వివేది అనే మహిళ ఇంటి నుంచి 12 వేల లీటర్ల పెట్రోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విదర్భ పెట్రోల్ డిపో నుంచి బయలుదేరిన ట్యాంకర్ల నుంచి సదరు మహిళ కొంత మొత్తంలో పెట్రోల్‌ను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. 'ఆమె తన ఇంట్లోనే మినీ పెట్రోల్ బంకు నడుపుతోంది.. దీనిని చూసి షాక్ అయ్యాం' అని పోలీసులు చెప్పారు. గత కొన్ని నెలలుగా ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
పెట్రోల్ చోరీ ఇలా..
fuel theft from petrol tanker: ట్యాంకర్ల నుంచి చోరీ జరగకుండా పెట్రోలియం కంపెనీలు అమర్చే రెండంచెల భద్రతా వ్యవస్థను అక్రమార్కులు చాకచక్యంగా తెరవగలుగుతున్నారని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గోపాల్ బిరాదార్ తెలిపారు.
"ట్యాంకర్ డ్రైవర్లు కొన్ని వందల లీటర్ల పెట్రోల్ తీసి అక్రమంగా పెట్రోలు విక్రయించే ముఠాలకు 22 లీటర్ల క్యాన్‌ను రూ.1200 నుంచి రూ.1500కు విక్రయిస్తున్నారు. అనంతరం అదే డబ్బాను మీనా ద్వివేది రూ.1800కు విక్రయిస్తుంటుంది."
-గోపాల్ బిరాదార్, అజ్ని ఏసీపీ
వాహన దారులకు నష్టం..
petrol kerosene mixing: ట్యాంకర్‌లో పెట్రోల్ దొంగిలించిన అనంతరం డ్రైవర్ సహాయంతో అందులో కిరోసిన్‌తో పాటు.. ఇతర ద్రావణాలను మీనా కలిపేదని కనుగొన్నారు పోలీసులు. దీనివల్ల పెట్రోల్ బంకు యజమాని సహా.. వినియోగదారులకూ తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిపారు. 'ట్యాంకర్ పెట్రోల్ బంకు వద్దకు చేరుకోకముందే కొన్ని వందల లీటర్లు చోరీకి గురువుతోంది' అని ఏసీపీ చెప్పారు.
ఇవీ చదవండి: