పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఐఎఫ్ఎస్ అధికారి. ఈ ఘటన దిల్లీలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే: అంశుమాన్ రాజహంస 2020 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా ఇంజనీర్‌తో 2017లో పరిచయం ఏర్పడింది. ఈమె సివిల్స్ పరీక్షకు సన్నద్ధం కోసం దిల్లీలోని రాజేంద్ర నగర్‌కు వచ్చింది. అప్పుడే రాజహంసతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం వివాహానికి ముందే ఇద్దరు శారీరకంగా ఒక్కటయ్యారు. 2018 సివిల్స్‌లో రాజహంసకు ఐఆర్టిఎస్ ర్యాంకు వచ్చింది. అనంతరం సివిల్స్ ఉన్నత క్యాడర్ ఉన్న ఉద్యోగాన్ని సాధించి పెళ్లి చేసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చాడు రాజహంస. 2020లో ఐఎఫ్ఎస్కు ఎంపికైన తర్వాత తనను గుడిలో పెళ్లి చేసుకున్నాడని.. అయితే ఆ సమయంలో ఫొటోలు తీయడానికి అతను అనుమతించలేదని బాధితురాలు తెలిపింది.
2020 సివిల్స్‌లో ఐఎఫ్ఎస్ ఉద్యోగాన్ని సాధించిన రాజహంసకు.. శిక్షణ పూర్తయాక ఝూర్ఖండ్లో ఉద్యోగం వచ్చింది. దిల్లీ నుంచి ఝూర్ఖండ్‌కు మకాం మార్చాడు. బాధితురాలు అతడిని కలిసి పెళ్లి చేసుకుందామని కోరగా తిరస్కరించాడు. దీంతో నిందితుడిపై రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది బాధితురాలు. 15 రోజుల నుంచి పోలీసులు వెతుకుతున్నారు. నిందితుడు రాంచీలో ఉన్నాడని సమాచారం అందడం వల్ల అక్కడికి వెళ్లారు. జంషెడ్‌పుర్ ఇలా పలు ప్రదేశాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఆఖరికి కోల్‌కతాలో పట్టుకున్నారు. నిందితుడ్ని దిల్లీలోని కోర్టు ముందు ప్రవేశపెట్టి.. అనంతరం జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి: భార్యకు నిప్పంటించిన భర్త.. ఏడేళ్ల బాలికపై మైనర్లు అత్యాచారం
సినిమా స్టైల్లో స్టూడెంట్‌కు టీచర్ ప్రపోజ్.. పోయిన ఉద్యోగం