ETV Bharat / bharat

దోమలపై పోరుకు దోమలే అస్త్రాలు.. డెంగ్యూ, చికెన్​ గున్యాకు ఇక చెక్​!

దేశంలో ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న వైరస్‌ల నియంత్రణకు భారత వైద్య పరిశోధనా సంస్థ(ఐసీఎంఆర్​) విస్తృత ప్రయోగాలు చేస్తోంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్‌లను ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన దోమలతోనే నియంత్రించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం పుదుచ్చేరిలోని వెక్టార్‌ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్‌తో కలిసి నాలుగేళ్లుగా చేస్తున్న పరిశోధనను కొలిక్కి తెచ్చింది. డెంగ్యూ, చికెన్‌ గున్యాను మోసుకెళ్లే దోమలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన దోమలతో భర్తీచేసేందుకు ఐసీఎంఆర్​ రంగం సిద్ధం చేసింది. ఇక ప్రభుత్వ అనుమతే తరువాయి అంటోంది.

ICMR- VCRC develops bacteria-infected mosquitoes to control dengue strains

author img

By

Published : Jul 6, 2022, 5:38 PM IST

డెంగ్యూ, చికెన్‌ గున్యా వైరస్‌ల కారణంగా దేశంలో ఏటా లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినా దేశంలో ఏదో మూల డెంగ్యూ, చికెన్‌ గున్యా ప్రబలుతూనే ఉన్నాయి. ఈ వైరస్‌లను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారత వైద్య పరిశోధనా సంస్థ-ఐసీఎంఆర్​ చేపట్టిన పరిశోధన దాదాపు కొలిక్కి వచ్చింది. డెంగ్యూ, చికెన్‌ గున్యా వైరస్‌లు దోమల్లో చేరి అవి మనుషులను కుట్టినప్పుడు వారిలో చేరి తీవ్ర అస్వస్థతకు కారణమవుతున్నాయి. ఈ రెండు వైరస్‌లు ఎడిస్ జాతి దోమలనే వాహకాలుగా చేసుకుని వ్యాప్తి చెందుతాయి.

డెంగ్యూ, చికెన్‌ గున్యా వైరస్‌ల నియంత్రణకు భారత వైద్య పరిశోధనా సంస్థ-ఐసీఎంఆర్​, పుదుచ్చేరిలోని వెక్టార్‌ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్‌-వీసీఆర్​సీతో కలిసి నాలుగేళ్ల క్రితమే ఒక పరిశోధన చేపట్టింది. అది డెంగ్యూ, చికెన్‌ గున్యా దోమలను అదేజాతికి చెందిన ప్రత్యేక దోమలతో నియంత్రించడం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఈదిశగా ఐసీఎంఆర్​-వీసీఆర్​సీ చేస్తున్న పరిశోధన తుది దశకు చేరింది. డెంగ్యూ, చికెన్‌ గున్యా వైరస్‌లను సమర్థంగా అడ్డుకునేందుకు వోల్బాచియా బ్యాక్టిరీయాను ICMR-VCRC ఎంచుకున్నాయి. వోల్బాచియా బ్యాక్టీరియా అత్యంత సూక్ష్మ పరిమాణంలో ఉంటుంది. వైరస్‌లను వృద్ధి చెందనివ్వదు. అందుకే ఐసీఎంఆర్​-వెక్టార్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ పుదుచ్చేరి వోల్బాచియా బ్యాక్టీరియా స్ట్రెయిన్‌లను చొప్పించిన దోమల సంతతిని ప్రయోగశాలలో వృద్ధి చేసింది. పరిశోధన కోసం ఆస్ట్రేలియాలోని ఉన్న మోనాష్ విశ్వవిద్యాలయం నుంచి వోల్బాచియా స్ట్రెయిన్‌లను కలిగి ఉన్న పదివేల గుడ్లను తెప్పించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు.

వోల్బాచియా గుడ్ల నుంచి వచ్చిన దోమలతో పుదుచ్చేరిలో ఉన్న ఎడిస్ ఈజిప్టి దోమల సంపర్కం ద్వారా.. వోల్బాచియా బ్యాక్టిరీయా కలిగిన పుదుచ్చేరి ఎడిస్ ఈజిప్టి దోమలను విజయవంతంగా సృష్టించారు. వోల్బాచియా బ్యాక్టీరియా అది సోకిన దోమలోని ప్రతి కణంలోకి చేరిపోతుంది. అది డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వైరస్‌లను వృద్ధిచెందనివ్వదు. వోల్బాచియా బ్యాక్టీరియా కలిగిన ఆడ దోమలను మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో వదలడం ద్వారా అవి స్థానికంగా ఉండే డెంగ్యూ, చికెన్‌ గున్యా వైరస్ ఉన్న మగదోమలతో జతకడతాయి. వాటి సంపర్కం వల్ల పుట్టే దోమ లార్వాల్లో వోల్బాచియా బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్‌ నిర్వీర్యమైపోతుందని ICMR-VCRC పుదుచ్చేరి డైరెక్టర్​ డాక్టర్ అశ్వినీ కుమార్ తెలిపారు.

ఐసీఎంఆర్​- వీసీఆర్​సీ పుదుచ్చేరి ప్రయోగశాలో నిర్వహించిన పరీక్షల్లో వోల్బాచియా బ్యాక్టీరియా ఉన్న దోమల వల్ల డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్‌ల సంఖ్య చెప్పుకోతగ్గ సంఖ్యలో తగ్గినట్లు తేలిందని డాక్టర్ అశ్వినీ కుమార్ వివరించారు. తమ పరిశోధన పూర్తైందన్న ఆయన ఇక కేంద్ర ప్రభుత్వ అనుమతి మాత్రమే పెండింగ్‌లో ఉందని చెప్పారు. తమ పరిశోధన అమలు చేయాలంటే ప్రభుత్వం నుంచి అనేక రకాల అనుమతులు కావాలని ఆయన చెప్పారు. స్థానిక ప్రాంతాల్లో బ్యాక్టీరియాతో కూడిన దోమలను వారానికి ఒకసారి విడుదల చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఈ మేరకు స్థానికులు, రాజకీయ నాయకులు సహా మొత్తం సమాజాన్ని ఒప్పించి సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు.

సమాజంలోకి వోల్బాచియా బ్యాక్టీరియా కలిగిన ఆడదోమను వదిలిపెట్టిన తర్వాత అది బయట తిరిగే మగదోమతో జతకడుతుందని డాక్టర్ అశ్వినీ కుమార్ చెప్పారు. తద్వారా భవిష్యత్‌లో పుట్టే బయటి దోమల్లో వోల్బోచియా బ్యాక్టీరియా చేరుతుందన్నారు. అలా సమాజంలో ఉండే దోమలన్నీ కాలక్రమంలో బ్యాక్టీరియా దోమలతో నిండిపోతాయని ఆయన వివరించారు. అప్పుడు డెంగ్యూ, చికెన్‌ గున్యా వైరస్‌లు ఆయా దోమల్లోకి చేరలేక నియంత్రణ సాధ్యపడుతుందని చెప్పారు. ఇందుకోసం భారీ సంఖ్యలో వోల్బాచియా దోమలు, వాటి గుడ్లను పరిశోధన శాలలో విడుదలకు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.

ఇవీ చూడండి: ముషారఫ్​కు కళ్లెం వేసిన కలాం.. కశ్మీర్​పై మాట్లాడకుండా చేసి..

ఇళ్ల మధ్యలో చిరుత హల్​చల్.. స్థానికులు హడల్.. మత్తు మందు ఇచ్చి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.