కేరళలో భార్యకు నిప్పంటించిన అనంతరం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పతనంతిట్ట జిల్లా తిరువళ్ల నెడుంబరానికి చెందిన 65 ఏళ్ల మత్తుకుట్టీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతడి భార్య సారమ్మ(59)కు ఆదివారం మధ్యాహ్నం నిప్పంటించాడు. ఆమెను కాపాడబోయే క్రమంలో వారి కుమార్తె లిజీ తీవ్ర గాయాలపాలయ్యారు. లిజీని అలప్పుజలో ఓ ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీంచిన అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: భార్యపై లైంగిక వేధింపులు- భర్త అరెస్ట్