ETV Bharat / bharat

వెండి వస్తువులు నల్లగా మారాయా? - ఇలా చేస్తే ధగధగా మెరిసిపోతాయి! - Silver item Cleaning Tips

Tips to Clean Silver Items: మీ వెండి వస్తువులు నల్లగా మారాయా..? ఎంత ప్రయత్నించినా తెల్లగా కావట్లేదా? అయితే నో వర్రీ. ఈ టిప్స్​ ద్వారా.. మునుపటి మెరుపులోకి తీసుకురావొచ్చు!

Tips to Clean Silver Items
Tips to Clean Silver Items
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 4:47 PM IST

Silver Items Cleaning Tips: బంగారం తర్వాత ఎక్కువ డిమాండ్​ ఉన్నది వెండికే. దాదాపు అందరి ఇళ్లల్లోనూ వెండి వస్తువులు ఉంటాయి. కాళ్ల పట్టీల నుంచి దేవుడి విగ్రహాల వరకు చాలా రకాలు మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. అయితే.. అందంగా, ప్రకాశవంతంగా కనిపించే వెండి వస్తువులు కొన్ని రోజుల తర్వాత నల్లగా మారుతాయి. దానికి కారణం.. వెండి నగలపై ఉండే ఆక్సైడ్‌ పూత. ఇది గాలి తగలడం వల్ల క్రమంగా మెరుపు తగ్గిపోతుంది.. దీంతో కొన్నాళ్లకు వస్తువులు నల్లగా మారుతాయి. అయితే.. ఈ టిప్స్​ ఫాలో అయ్యి.. వెండి వస్తువులను మెరిసేలా చేయండి.

ఈ క్లీనర్​తో - మీ బాత్ రూమ్​ తళతళా మెరిసిపోద్ది!

బేకింగ్​ సోడా: చాలామంది బేకింగ్ సోడాను వివిధ లోహాలతో కూడిన వస్తువులను శుభ్రం చేసేందుకు వినియోగిస్తారు. అయితే దీనిని వినియోగించి వెండి వస్తువులను కూడా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. దీనిని వినియోగించడానికి ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసుకొని బేకింగ్ సోడాను కలపి పేస్ట్​లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వెండి వస్తువులపై అప్లై చేసి మెత్తని బ్రష్​తో స్మూత్​గా రుద్దాలి. ఇలా ఐదు నిమిషాల పాటు రుద్దిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకుని పొడి క్లాత్​తో తుడుచుకుంటే వెండి ఆభరణాలు మెరుస్తాయి.

పిల్లలు వైట్​ సాక్స్​ నల్లగా మార్చేస్తున్నారా? - ఈ చిట్కాలతో కొత్త వాటిలా!

బేకింగ్​ సోడా, అల్యూమినియం ఫాయిల్​: బేకింగ్​ సోడా వెండి వస్తువులను తెల్లగా మెరిసేలా చేస్తుంది. దీని కోసం బేకింగ్​ సోడాను పేస్ట్​లాగా చేసుకుని ఆ ఆభరణాన్ని అల్యూమినియం ఫాయిల్​తో చుట్టండి. మీ వస్తువుల రంగు బట్టి 3 సెకన్ల నుంచి 3 నిమిషాల వరకు ఫాయిల్​ చుట్టి ఉంచొచ్చు. తర్వాత క్లీన్​ చేసుకుంటే సరి..

మీ కిచెన్ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? - ఈ టిప్స్​ ట్రై చేస్తే స్మెల్​ పరార్​!

నిమ్మకాయ అండ్​ సాల్ట్​ బాత్​: చాలామంది నిమ్మకాయను ఇనుప, ఇత్తడి వస్తువులను శుభ్రం చేసేందుకు వినియోగిస్తారు. అయితే.. దీనిని సిల్వర్​ ఆర్టికల్స్​ను శుభ్రం చేసేందుకు కూడా వినియోగించవచ్చు. దీనిని వినియోగించే ముందు ఒక గిన్నెలో మూడు స్పూన్ల ఉప్పు, కొన్ని వేడినీరు పోసుకోవాలి. తర్వాత అందులో ఓ నిమ్మకాయను పిండాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో వెండి వస్తువులను వేసి.. కొద్దిసేపటి తర్వాత బయటికి తీసి మెత్తని క్లాత్​తో క్లీన్​ చేస్తే.. వెండి ఆభరణాలకు మెరుపు గ్యారెంటీ..

గ్యాస్ స్టౌ నుంచి మంట సరిగా రావట్లేదా? - ఇలా ఈజీగా సెట్ చేయండి!

టూత్​పేస్ట్​: టూత్​పేస్ట్​లో ఉండే క్యాల్షియం వెండి వస్తువులను మెరిసేలా చేస్తుంది. చాలా తక్కువ మొత్తంలో పేస్టు తీసుకుని దాన్ని వెండి వస్తువులకు పల్చని పొరలా పూయాలి. తర్వాత పేస్ట్​ ఆరిపోయే వరకు ఆగాలి. ఆ తర్వాత టిష్యూ పేపర్​తో తుడిచి నీటితో శుభ్రం చేసేయాలి. ఇలా చేస్తే అవి తిరిగి తెల్లగా మారతాయి. ఇంకా వెండి వస్తువుల నలుపు పూర్తిగా పోకపోతే ఇదే పద్ధతిని మరోసారి ఫాలో అయితే సరిపోతుంది.

How to Get Rid of Smell in Bathroom : ఈ టిప్స్ పాటించండి.. మీ బాత్రూమ్ దుర్వాసనొస్తే అడగండి..!

Best Smartphone Cleaning Tips : ఈ బెస్ట్ స్మార్ట్​ఫోన్ క్లీనింగ్ టిప్స్ ఫాలో అవ్వండి.. స్క్రీన్, కెమెరా, స్పీకర్ దెబ్బతినకుండా చూసుకోండి.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.