ETV Bharat / bharat

ఇద్దరమ్మాయిల ప్రేమ.. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి! - greater noida homosexual cousins

Homosexual cousins: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని తెలిసి పారిపోయి కలిసి జీవిస్తున్నారు.

homosexual-cousins
ఇద్దరమ్మాయిల ప్రేమ.. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి
author img

By

Published : May 18, 2022, 12:42 PM IST

Homosexual cousins married: ఉత్తర్​ ప్రదేశ్​ గ్రేట​ర్​ నోయిడా దన్కౌర్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఇద్దరు స్వలింగ సంపర్క యువతులు పెళ్లి చేసుకున్నారు. వీరు అన్నా చెల్లెళ్ల కుమార్తెలు కావడం గమనార్హం. తమ ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని భావించి కొద్ది పారిపోయి గుడిలో వివాహం చేసుకున్నారు. అనంతరంలో దిల్లీలోని ఓ కాలనీలో కలిసి జీవిస్తున్నారు.

ఏం జరిగిందంటే?: ఈ యువతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. సొంత అన్నా చెల్లెళ్ల కుమార్తెలు. ఒకరు గ్రేటర్ నోయిడాలోని గ్రామంలో, మరొకరు దిల్లీలో ఉంటారు. అయితే కొద్ది రోజలు క్రితం గ్రేటర్​ నోయిడా గ్రామంలోని అమ్మాయి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తమ కుమార్తెకు ఏమైందో అనే భయంతో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు కుటుంబసభ్యులు. అయితే అదే రోజు దిల్లీలోని మరో అమ్మాయి కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వారు కూడా పోలీస్ కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదులతో యువతుల ఆచూకీ కనిపెట్టేందుకు గ్రేటర్ నోయిడా, దిల్లీ పోలుసులు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో తనిఖీలు చేస్తుండగా.. ఇద్దరూ కనిపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.

తాము ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని, కలిసే జీవిస్తామని ఆ యువతులు పోలీసులకు చెప్పారు. వెంటనే కుటుంబసభ్యులను స్టేషన్​ రప్పించి వారితో మాట్లాడించారు పోలీసులు. అయితే ఎంత నచ్చజెప్పినా ఈ యువతులు వినలేదు. ఈ విషయం అందరికీ తెలిస్తే సమాజంలో సమాజం పరువు పోతుందని చెప్పినా వెనకడుగు వేయలేదు. ఇద్దరు వయోజనులు కావడం వల్ల పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు.

ఇద్దరు యువతులు స్వలింగ సంపర్కులు కావడం వల్లే పెళ్లి చేసుకున్నారని కోత్వాలీ దన్కౌర్ స్టేషన్ ఇంఛార్జ్​ రాధా రమణ్ సింగ్ తెలిపారు. ఇద్దరు మేజర్లు కావడం వల్ల వారికి ఇష్టమైన విధంగా జీవించే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. కొద్ది రోజుల పాటు వారిని సురక్షిత ప్రాంతంలో ఉంచుతున్నట్లు చెప్పారు. ఓ బంధువును కూడా వారితో పాటు పంపినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: విరాళంగా రూ.కోట్ల ఆస్తి.. కుటుంబంతో కలిసి 'ప్రపంచానికి' దూరంగా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.