ETV Bharat / bharat

లాడ్జిలో వంట గదిలాంటి సెటప్.. సీక్రెట్ డోర్ ఓపెన్ చేస్తే అమ్మాయిలతో.. - bengaluru latest news

బెంగళూరులో ఓ హైటెక్​ వ్యభిచార రాకెట్​ వెలుగులోకి వచ్చింది. లాడ్జీలోని ఓ రహస్య గదిని ఏర్పాటు చేసుకుని తమ కార్యకలాపాలను సాగిస్తున్న ఆ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

High tech prostitution racket in Bengaluru

author img

By

Published : Nov 18, 2022, 10:45 AM IST

ఆ గదిలో గ్యాస్​, వంట సామాన్లు అన్నీ ఉన్నాయి. కానీ అది వంట గది కాదు. ఆ గోడకు అమర్చిన టైల్స్​ను నిశితంగా గమనిస్తే ఏదో తేడాగా కనిపిస్తుంది. వాటిని తీసి చూస్తే ఓ చిన్న ద్వారం కనిపిస్తుంది. లోపలకు వెళ్తే రెండు గదులుంటాయి. అక్కడే అసలు గుట్టు ఉంటుంది. పోలీస్ స్టేషన్​కు సమీపంలోనే ఎవరికీ చిక్కకుండా వ్యభిచార కార్యకలాపాలు సాగించేందుకు ఓ ముఠా చేసుకున్న ఈ రహస్య ఏర్పాట్లు.. చాలాకాలం తర్వాత వెలుగులోకి వచ్చాయి. బెంగళూరు పోలీసుల తనిఖీలతో అక్రమార్కుల గుట్టు రట్టయింది. రహస్య గదుల్లో దాచి ఉంచిన ఏడుగురు మహిళల్ని పోలీసులు రక్షించారు. మరో ఆరుగురిని అరెస్టు చేశారు.

High tech prostitution racket in Bengaluru
గోడలో ఏర్పాటు చేసిన సీక్రెట్​ రూమ్​

ఆ రహస్య ద్వారంలోకి వెళ్తే రెండు రూమ్​లు ఉంటాయి. దాదాపు 10 నుంచి 12 మందికి సరిపోయేలా నిర్మించిన ఈ గదుల్లో సరైన గాలి, వెలుతురు ఉండదు. ఎవరైనా కాస్త ఎక్కువసేపు అక్కడ ఉంటే ఊపిరాడక ఇబ్బంది పడాల్సిందే. ఎలుకలు సైతం కలియతిరిగే ఆ ఇరుకైన గదుల్నే ఆసరాగా చేసుకుని వారు తమ దందాను సాగిస్తున్నారు. అకస్మాత్తుగా పోలీసులు వస్తే.. వ్యభిచారం చేస్తున్న వారిని ఆ గదుల్లో దాచిపెడతారు. నవంబర్​ 7న ఇదే జరిగింది. పోలీసులు సోదాలకు వచ్చేసరికి.. ఇద్దరు యువతుల్ని రహస్య గదుల్లో దాచిపెట్టారు. అప్పుడు ఏమీ దొరకక.. పోలీసులు వెనుదిరిగారు.
అయితే.. ఈ లాడ్జిపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా.. రహస్య గదుల వ్యవహారం బయటపడింది. మరోసారి పోలీసులు లాడ్జిపై దాడులు చేసి.. వ్యభిచారం ముఠా గుట్టు రట్టు చేశారు.

సీక్రెట్​ రూమ్​ ఉన్న గది

సీక్రెట్​ రూమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.