ETV Bharat / bharat

'డెంగీ' డేంజర్ బెల్స్- ఆ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు - డెంగీ ఫీవర్​ కట్టడికి కేంద్ర బృందాలు

దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డెంగీ​ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు వైద్య నిపుణులతో కూడిన బృందాలను పంపనున్నట్లు కేంద్రం తెలిపింది. మిగతా రాష్ట్రాల్లోనూ డెంగీ కట్టడికి విస్తృతమైన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొంది.

dengue
'డెంగీ' డేంజర్ బెల్స్
author img

By

Published : Nov 3, 2021, 5:08 AM IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో డెంగీ విజృంభిస్తున్న నేపథ్యంలో.. కేంద్రం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. సుమారు 9 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉన్నత స్థాయి వైద్య నిపుణులతో కూడిన కేంద్ర బృందాలను పంపాలని నిర్ణయించింది. దిల్లీలో కొద్దిరోజులుగా విష జ్వరాల విపరీతంగా పెరిగిపోయాయి. వీటితో పాటు పంజాబ్​, హరియాణా, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​, జమ్ముకశ్మీర్​లలో కూడా జ్వరాల సంఖ్య పెరిగింది. దీంతో కేంద్రం అక్కడ పరిస్థితిని సమీక్షించి, సూచనలు చేసేందుకు కేంద్ర బృందాలను పంపాలని నిర్ణయించింది.

నిపుణుల బృందాలలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్​లకు సంబంధించి అధికారులు ఉంటారని పేర్కొంది. వ్యాధి నియంత్రణ, నిర్వహణ కోసం డెంగీ యాక్టివ్‌గా ఉన్న రాష్ట్రాలకు నిపుణుల బృందాలను గుర్తించి పంపాలని ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవియా.. కేంద్ర ఆరోగ్య కార్యదర్శిని ఆదేశించారు.

ఇదీ చూడండి: Corona Cases: కేరళలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.