ETV Bharat / bharat

'చట్టాల అమలు వాయిదానే ఉత్తమ ఆఫర్'

నూతన సాగు చట్టాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని కేంద్రం చేసిన ప్రకటన అత్యుత్తమైనదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్ అభిప్రాయపడ్డారు. రైతు సంఘాలు తమ నిర్ణయాన్ని వెల్లడించాలని, లేదంటే రైతులనే నేరుగా కలుసుకుంటామని తేల్చి చెప్పారు.

Govt's offer best for farmers; Hopeful that unions will reconsider it: Tomar
చట్టాల తాత్కాలిక వాయిదా ఉత్తమ ఆఫర్​:తోమర్
author img

By

Published : Jan 25, 2021, 6:38 PM IST

నూతన సాగు చట్టాలను ఒకటిన్నరేళ్ల పాటు నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను అత్యుత్తమ ప్రతిపాదనగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్ అభివర్ణించారు. ఈ మేరకు రైతు సంఘాలు త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్రం, రైతుల మధ్య జరిగిన చర్చలు 11వ దఫా సైతం అసంపూర్తిగానే ముగిశాయి. అంతకుముందు 10వసారి చర్చల్లో ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి సంవత్సరం లేదా ఒకటిన్నర సంవత్సరం పాటు తాత్కాలికంగా వాయిదా వేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 11వ దఫా చర్చల్లో చట్టాల అమలు తాత్కాలిక వాయిదా అంశాన్ని పరిశీలించాలని తోమర్ సూచించారు.

సాగు చట్టాలను తాత్కాలికంగా నిలిపివేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఇది ఉత్తమమైన ప్రతిపాదన. రైతు సంఘాలు దీనిపై చర్చించుకుని ప్రభుత్వాన్ని సంప్రదిస్తే ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తాం. త్వరలోనే తమ నిర్ణయం వెల్లడిస్తారని కోరుకుంటున్నా.

-కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్

చర్చలుండవ్​: తోమర్

ఇకపై రైతు సంఘాలతో చర్చలు ఉండవని.. నేరుగా రైతులను కలిసి అభిప్రాయాలు తీసుకుంటామని 11దఫా చర్చల అనంతరం తోమర్​ స్పష్టం చేశారు. తాత్కాలిక వాయిదాపై రైతులే అంతిమ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

జనవరి 26న 'కిసాన్​ గణతంత్ర పరేడ్​' అనంతరం రైతులు తమ నిర్ణయాన్ని కేంద్రానికి తెలపాల్సి ఉంది.

మరోవైపు రైతు ఆందోళనలపై సుప్రీంకోర్టు నియమిత కమిటీ రైతు సంఘాలతో జనవరి 27న రెండవ దఫా చర్చలు జరపనుంది.

కొనసాగుతున్న నిరసనలు..

సాగు చట్టాలను రద్దు చేయాల్సిందిగా పంజాబ్​, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల రైతులు దిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్నారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా వీరు చేస్తున్న ఆందోళనలు 60రోజులు దాటాయి. వీరికి మద్దతుగా మహరాష్ట్రలో అన్నదాతలు భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి: రైతు సంఘాల నేతలపై తోమర్​ ఫైర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.