Goods train accident: ఝార్ఖండ్ గుమ్లా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం కారణంగా.... వివిధ రైలు సర్వీసులకు అనేక గంటలుగా అంతరాయం కలుగుతోంది. ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు కాగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. గుమ్లా జిల్లాలోని కుర్కురా రైల్వే స్టేషన్ వద్ద శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగినప్పటికీ.... రైల్వే లైన్‌పై నుంచి ప్రమాదానికి గురైన రైళ్లను తొలగించే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఘటనాస్థలి నుంచి శిథిలాలను తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఈ రైల్వే లైను పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. భారీ క్రేన్లు, ఇతర పెద్ద మెషీన్లు ఘటనాస్థలికి చేరాయి.




ప్రమాదం ఎలా జరిగింది?
train services disrupted: హాటియా-రౌర్కెలా రైల్వే లైనుపై కుర్కురా స్టేషన్ వద్ద రెండు గూడ్స్ రెళ్లు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. శనివారం రాత్రి 9:45 గంటలకు ఈ ఘటన జరిగింది. రౌవుర్కెలా నుంచి బాక్సైట్ లోడ్‌తో బోకారోవైపు వెళ్తున్న గూడ్స్ రైలు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అదే సమయంలో.. హాటియా నుంచి కిరుంబురూ కరంపదాకు వెళ్లే మరో ఖాళీ గూడ్స్ రైలు లూప్ లైను నుంచి మెయిన్ లైను మీదకు వచ్చింది. దాంతో ఈ రెండు రైళ్లు ఢీకొన్నాయి. అప్రమత్తమైన రైలు డ్రైవర్లు కిందకు దూకారు. ఈ ఘటనలో ఓ రైలు డ్రైవర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి.



ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడ్డ లోకో పైలట్ రంజిత్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. రెండు గంటల తర్వాత అధికారులు శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలు 12 బోగీలు ధ్వంసమయ్యాయి.
ఇదీ చూడండి: నూడిల్స్ ఫ్యాక్టరీలో పేలుడు- ఆరుగురు మృతి
ఇదీ చూడండి: పోలీసులపై 300మంది వలస కార్మికుల దాడి!