చైనా సరిహద్దు వివాదంలో అసువులు బాసిన కల్నల్ సంతోష్ బాబు త్యాగానికి తగిన పురస్కారం దక్కింది. సైనిక పతకాలలో రెండో అత్యున్నత పురస్కారం మహావీర్ చక్రను కేంద్ర ప్రభుత్వం సంతోష్ బాబుకు అందించింది.
గత జూన్‌లో గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు పురస్కారాలు అందించాలని సైనిక ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు.
గత ఏడాది జూన్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్‌తో సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు.
కీర్తి చక్ర, శౌర్య చక్ర..
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో 2020 ఏప్రిల్ 4న వీరమరణం పొందిన సుబేదార్ సంజీవ్ కీర్తిచక్ర అవార్డుకు ఎంపికయ్యారు.
గతేడాది మేలో జమ్ముకశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన అనూజ్ సూద్‌ను శౌర్య చక్ర అవార్డ్ వరించింది.
యుద్ధ సమయంలో సైనికుల ధైర్యసహసాలకు ఇచ్చే అత్యున్నత పతకాలలో పరమ్‌వీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర అవార్డులు ఉన్నాయి. శాంతి సమయంలో ఇచ్చే పురస్కారాలలో అశోక్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర అవార్డులు అత్యున్నతమైనవి.
ఇదీ చదవండి:భారత్- చైనా సైనికుల మధ్య మళ్లీ ఘర్షణ