Free Education For Poor Girls : ఆర్థికంగా వెనుకబడిన బాలికలకు చదువు చెబుతూ వారికి తల్లిగా మారారు మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన సోనియా జాలీ అనే మహిళ. ఉప్కార్ సొసైటీ అనే ఎన్జీఓను స్థాపించి పేద బాలికలకు ఉచితంగా విద్య అందిస్తున్నారు. 31 ఏళ్ల వయసులో ఆరుగురు బాలికల బాధ్యతలను భుజానికెత్తుకున్న సోనియా.. ప్రస్తుతం 130 మందికి చదువు చెబుతున్నారు.
"నాకు దృఢ సంకల్పం, అభిరుచి ఉంది. ఆరుగురు పిల్లలకు ఉచిత విద్యను అందించడం ప్రారంభించా. ఇప్పుడు 130మంది బాలికలు, ఐదు శాఖలు, 13మంది ఉపాధ్యాయులు మా ఎన్జీఓలో ఉన్నారు. మా దగ్గర ఉన్న ఓ చిన్నారి ప్లే గ్రూప్‌లో ఉంది. పెద్ద అమ్మాయి బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతూ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది."
--సోనియా జాలీ, ఉప్కార్ సొసైటీ ఫౌండర్
సోనియా జాలీ స్థాపించిన ఉప్కార్ సొసైటీలో చదువుతున్న బాలికలందరూ ఆమెను అమ్మ అని పిలుస్తున్నారు.
"నేను గత రెండు ఏళ్లుగా నుంచి ఇక్కడ చదువుతున్నా. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చదవడం, పనులను చేస్తున్నాను. అలాగే డ్యాన్స్ చేస్తుంటాం. పాటలు పాడుతుంటాం."
--షాను కుశ్వాహా, విద్యార్థి
"మేము ఇక్కడ ఎన్జీఓ ప్రారంభించినప్పుడు 12 మంది బాలికలు ఉన్నారు. మేము కష్టపడి పని చేశాం. సోనియా అమ్మ చెంతన మేము ఉన్నాం. మేము ప్రతి రంగంలో విజయాలు సాధిస్తున్నాం."
--కంచన్ వర్మ, టీచర్
తాను చేసే పనికి ప్రభుత్వం నుంచి ఎప్పుడూ సాయం కోరలేదని, ఉప్కార్ సొసైటీ ద్వారా చేసే అన్ని పనులకు తాను దాచుకున్న డబ్బును ఉపయోగిస్తున్నానని సోనియా చెప్పారు.
మురికివాడల్లో ఉండే పేద పిల్లలకు ఉచిత విద్య
Free Education For Poor Students : మురికివాడల్లో ఉండే పేద పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తున్నారు దంపతులు. అంతే కాకుండా పాఠశాలకు వచ్చేందుకు వీలుగా ఫ్రీ ఆటో సదుపాయం కూడా కల్పిస్తున్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందేందుకు స్పెషల్ కంప్యూటర్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు. పదేళ్లుగా విద్యాదానం చేస్తున్న ఆ దంపతులు ఎవరు? వారి సంగతేంటో ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకుందాం.