ETV Bharat / bharat

'ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహణ రైతుల రాజ్యాంగ హక్కు'

author img

By

Published : Jan 18, 2021, 4:13 PM IST

దిల్లీలో ట్రాక్టర్​ ర్యాలీని శాంతియుతంగా నిర్వహించడం రైతుల రాజ్యాంగ హక్కని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ర్యాలీ జరుపుతామని పేర్కొన్నారు.

formers unions said that tractor rally in delhi on janvary 26 is the constitutional right
'ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించడం రైతుల రాజ్యాంగ హక్కు'

రైతులు శాంతియుతంగా ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించుకోవడం రాజ్యాంగ హక్కని రైతు సంఘాల నేతలు అన్నారు. జనవరి 26న దిల్లీలో ర్యాలీకి అనుమతించే వ్యవహారాన్ని దిల్లీ పోలీసులకే సుప్రీంకోర్టు వదిలేసిన నేపథ్యంలో రైతు సంఘాలు ఈమేరకు స్పందించాయి.

దిల్లీలోని రాజ్​పథ్​లో ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించడం లేదు. కేవలం దిల్లీ సరిహద్దుల్లోని ఔటర్​ రింగ్​ రోడ్డు ప్రాంతంలో ర్యాలీ జరుపుతాం. గణతంత్ర దినోత్సవానికి ఇది ఎలాంటి ఆటంకం కలిగించదు. మా రాజ్యాంగ హక్కును వినియోగించుకుంటాం.

-పారామిత్​ సింగ్​, భారతీయ కిసాన్​ యూనియన్​ పంజాబ్​ జనరల్​ సెక్రటరీ

ట్రాక్టర్​ ర్యాలీకి దిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వకపోతే రాజ్యాంగ హక్కును వినియోగించుకునే అధికారం రైతులకు ఉంది. శాంతి భద్రతల సమస్యలు వస్తాయని భావిస్తే.. మా ర్యాలీకి ఇంకో మార్గాన్ని సూచించాలి.

-జోగిందర్​ సింగ్​, ఏక్తా ఉగ్రహన్​ సంఘ అధ్యక్షుడు

ప్రభుత్వ కార్యక్రమాలు జరిగే ప్రదేశాలవైపు మేము వెళ్లబోము. మా ట్రాక్టర్లకు జాతీయ జెండాలను, మా రైతు సంఘాల జెండాలను మాత్రమే తగిలిస్తాం. ర్యాలీ అయిపోయిన వెంటనే తిరిగి మా నిరసన ప్రదేశానికి వస్తాం.

-లక్​భీర్​సింగ్​, ఆల్ ఇండియా కిసాన్​ సభ ఉపాధ్యక్షుడు

ఇదీ చదవండి:రైతుల ఐకాస​ నుంచి బీకేయూ నేత సస్పెన్షన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.