Flight Basavaraj Bommai: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి ప్రమాదం తప్పింది. మరికొద్దిసేపట్లో వీరు ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉందనగా ఇబ్బంది ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా వీరు ప్రయాణిస్తున్న ఫ్లైట్ అరగంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. బెంగళూరు నుంచి హూబ్లీకి బయలుదేరిన ఈ విమానం ఉదయం 7.30కి ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఆలస్యమైంది.
'నేను ఓటు వేయడానికి వచ్చాను. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణం ఆలస్యమైంది' అని బొమ్మై వెల్లడించారు.
కర్ణాటకలో శాసనమండలి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హవేరీ జిల్లాలోని శిగ్గావ్లో ముఖ్యమంత్రి శుక్రవారం తన ఓటును వినియోగించుకున్నారు.
ఇదీ చూడండి : హెలికాప్టర్ ప్రమాదంపై అవేవీ నమ్మొద్దు: వాయుసేన