ETV Bharat / bharat

అపార్ట్​మెంట్​లో పేలిన సిలిండర్- ఇద్దరు మృతి - బెంగళూరు అగ్నిప్రమాదం ఫొటోలు

కర్ణాటకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

అపార్ట్​మెంట్​లో పేలిన సిలిండర్.. ఇద్దరు మృతి

author img

By

Published : Sep 21, 2021, 6:51 PM IST

Updated : Sep 21, 2021, 8:25 PM IST

అపార్ట్​మెంట్​లో పేలిన సిలిండర్

కర్ణాటకలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బెంగళూరు సమీపంలోని దేవర చిక్కనహళ్లి ఆశ్రిత్ అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని ఇద్దరు సజీవ దహనమయ్యారు.

fire accident
అపార్ట్​మెంట్​లో పేలిన సిలిండర్..

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు ఫైర్​ ఇంజిన్లు మంటలను ఆర్పుతున్నాయి. మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్​లో చిక్కుకున్న మహిళ సజీవ మరణానికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. ఓ ఫ్లాట్‌లో సిలిండర్ పేలుడే ఈ ఘటనకు కారణమని.. క్షణాల్లోనే ఇతర ఫ్లాట్లకు మంటలు వ్యాపించాయని స్థానికులు పేర్కొన్నారు.

fire accident
అపార్ట్​మెంట్​లో మంటలు

'తీవ్రంగా గాయపడిన పలువురిని ఆసుపత్రికి తరలించామని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి' అని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు

fire accident
అపార్ట్​మెంట్​లో ఎగసిపడుతున్న మంటలు

ఇవీ చదవండి:

Last Updated : Sep 21, 2021, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.