fifth class student made Robot: ఈ బాలుడు చదువుతున్నది ఐదో తరగతే.. అయితేనేం..? ఆర్మీ కోసం వినూత్న ఆలోచన చేశాడు. రెండు నెలల్లోనే రోబోను ఆవిష్కరించాడు. సైనిక అవసరాలకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించాడు పంజాబ్‌లోని లుథియానాకు చెందిన భవ్య జైన్. శత్రు భూభాగంలో ఏ చిన్న వస్తువునైనా ఈ రోబో కనిపెట్టగలదని చెబుతున్నాడు. భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేస్తానని అంటున్నాడు ఈ బాలమేధావి.
![fifth class student made Robot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15059500_l1.jpg)
"ఈ రోబో పేరు జార్విస్. ఆర్మీ, ఇతర రంగాల వారికి ఈ రోబో ఉపయోగపడుతుందని తయారు చేశా. ఇందులో 360 డిగ్రీల్లో పనిచేసే కెమెరా ఉంది. ఈ రోబోకు చెయ్యి అమర్చా. అది వస్తువులను ఎత్తడానికి, కిందికి దించడానికి ఉపయోగపడుతుంది. ఈఎస్‌బీ-32 అనే నెట్వర్క్ ద్వారా ఈ రోబో పనిచేస్తుంది. ఈ నెట్‌వర్క్‌ను లాప్టాప్, మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ చేసి ఈ రోబోను నియంత్రించవచ్చు."
-భవ్య జైన్, రోబో సృష్టికర్త
ఈ ప్రాజెక్ట్ వల్ల తనకు మంచి గుర్తింపు లభించిందని భవ్య జైన్ అంటున్నాడు. అతి చిన్న వయసులోనే రోబో తయారు చేయడం వల్ల ఇటీవలే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. భవ్య జైన్ సాధించిన విజయం పట్ల అతని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సైన్యానికి ఉపయోగపడే రోబోను తమ విద్యార్థి తయారు చేయడం గర్వంగా ఉందని అంటున్నారు.
![fifth class student made Robot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15059500_l3.jpg)
ఇదీ చదవండి: ఏకకాలంలో రెండు డిగ్రీలు.. భారతీయ, విదేశీ విద్యాసంస్థలు కలిసి!