సరైన పరిష్కారం దొరకకుండానే రైతులు తమ గ్రామాలకు వెళితే రైతులను రానున్న తరాలు క్షమించవని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేశ్ టికాయిత్ వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా.. దిల్లీ సరిహద్దులోని గాజీపుర్ వద్ద నిరసిస్తున్న రైతులను ఆదివారం ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా 'ఈటీవీ భారత్'తో మాట్లాడారు.
రైతులు అంత త్వరగా తమ ఆందోళనను వదిలివేయరని నరేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. ఎందుకంటే.. భవిష్యత్ తరాలకు తాము సమాధానం చెప్పాల్సి ఉంటుందనే విషయం రైతులకు తెలుసని పేర్కొన్నారు. తన సోదరుడు రాకేశ్ టికాయిత్ కాన్వాయ్‌పై ఇటీవల జరిగిన దాడికి సంబంధించి అసలైన నిందితులు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) విద్యార్థులు కారని అన్నారు.
ఇదీ చూడండి:'మరింత ఉద్ధృతంగా నక్సల్స్ ఏరివేత'