ETV Bharat / bharat

లాక్​డౌన్​కు వ్యతిరేకంగా ఈ నెల 8న రైతుల నిరసన! - పంజాబ్​లో రైతుల నిరసన

లాక్​డౌన్​కు వ్యతిరేకంగా.. ఈ నెల 8న పంజాబ్​లోని వీధుల్లో నిరసన చేపట్టనున్నట్లు రైతు సంఘాలు బుధవారం తెలిపాయి. కరోనాను కట్టడి చేయడంలో విఫలమైన ప్రభుత్వం లాక్​డౌన్ విధించిందని, రైతుల ఉద్యమాన్ని బలహీనపరచాలని చూస్తోందని​ ఆరోపించాయి.

protest against lockdown
లాక్​డౌన్​కు వ్యతిరేకంగా రైతుల నిరసన
author img

By

Published : May 6, 2021, 7:03 AM IST

లాక్​డౌన్​కు వ్యతిరేకంగా ఈ నెల 8న పంజాబ్​లోని నిరసన చేపట్టనున్నట్లు రైతు సంఘాలు బుధవారం తెలిపాయి. కొత్త సాగు చట్టాల రద్దుకు కొంతకాలంగా ఆందోళన చేపడుతున్న రైతు నేతలు ఈ మేరకు పిలుపునిచ్చారు. సింఘు సరిహద్దు ప్రాంతం వద్ద సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కేఎం) తరపున రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ విలేకరులతో మాట్లాడారు.

కరోనాను కట్టడి చేయడంలో విఫలమైన ప్రభుత్వం లాక్​డౌన్ విధించిందని, రైతుల ఉద్యమాన్ని బలహీనపరచాలని చూస్తోందని బల్బీర్​ సింగ్​ ఆరోపించారు. పంజాబ్​కు చెందిన 32 రైతు సంఘాలు ఈ నిరసనల్లో పాల్గొంటాయని తెలిపారు. లాక్​డౌన్​ను పాటించవద్దని, షాపులన్నీ తెరవాలని ప్రజలను కోరుతామన్నారు.

ఇదీ చూడండి: విదేశాల సాయం వివరాలెక్కడ?: రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.