ETV Bharat / bharat

విధి విలాపం- ఆ కుటుంబానికి మరుగుదొడ్డే నివాసం - గుడిసెపై కూలిన చెట్టు

8 మంది పిల్లలతో సహా ఓ కుటుంబం పబ్లిక్​ టాయిలెట్​లో నివసిస్తోంది. ఉత్తర్​ప్రదేశ్​ సోన్​భద్ర జిల్లాలో 15 ఏళ్లుగా తాము నివసిస్తున్న గుడిసెపై చెట్టు కూలగా.. వారికి ఈ దీనస్థితి తలెత్తింది. పీఎం ఆవాస్​ యోజన కింద ఇల్లు మంజూరైనా.. తమకు నిధులు అందలేదని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

shelter in community toilet
పబ్లిక్​ టాయిలెట్​లో నివసిస్తున్న కుటుంబం
author img

By

Published : Jun 21, 2021, 11:38 AM IST

పబ్లిక్​ టాయిలెట్​లో నివసిస్తున్న కుటుంబం

ఉత్తర్​ప్రదేశ్​లో సోన్​భద్ర జిల్లాలో ఓ కుటుంబం.. పబ్లిక్​ టాయిలెట్​లో నివసిస్తున్న దృశ్యాలు కలచి చేస్తున్నాయి. తాము నివసించే గుడిసెపై చెట్టు కూలగా వారికి ఈ దుస్థితి తలెత్తింది.

అసలేమైంది?

సోన్​భద్ర జిల్లా చోపన్​ నగర్​లో రాజేంద్ర నిషాద్​ అనే ఓ దివ్యాంగుడు తాపీ మేస్త్రీగా చేస్తున్నాడు. తన భార్య సహా ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులతో ఓ గుడిసెలో నివసించేవాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాల ధాటికి.. ఓ పెద్ద వేప చెట్టు వారి గుడిసెపై కూలింది. దాంతో ఉన్న గుడిసె కాస్తా కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాహాని కలగలేదు. కానీ, నిరాశ్రయులుగా మారిన కుటుంబ సభ్యులు.. సమీపంలోని ఓ పబ్లిక్​ టాయిలెట్​ను నమ్ముకున్నారు. అప్పటి నుంచి అక్కడే నివసిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

shelter in community toilet
పబ్లిక్​ టాయిలెట్​లో రాజేంద్ర నిషాద్​ కుటుంబం నివాసం
shelter in community toilet
గుడిసెపై కూలిన వేప చెట్టు

పదిహేనేళ్లుగా తాము గుడిసెలోని నివసిస్తున్నామని రాజేంద్ర నిషాద్ భార్య.. 'ఈటీవీ భారత్​'తో తెలిపారు. తమకు పీఎం ఆవాస్​ యోజన కింద ఓ ఇల్లు మంజూరు చేసినట్టు నగర పంచాయతీ అధికారులు చెప్పినా... ఇంకా పైకప్పు నిర్మాణానికి నిధులను అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండేళ్ల క్రితం తమకు ఇంటి నిర్మాణం కోసం మొదటి విడతలో... అధికారులు నిధులు మంజూరు చేశారని నిషాద్​ కుటుంబ సభ్యలు చెప్పారు. కానీ, రెండో విడత నిధులు అందకపోవటం వల్ల వారు ఆ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయామని తెలిపారు.

ఇల్లు నిర్మిస్తాం..

నిషాద్​ కుటుంబానికి తాము ఇల్లు నిర్మించి ఇస్తామని చోపన్ నగర్​ నగర పంచాయతీ​ అధికారులు​ హామీ ఇచ్చారు. మొదటి విడత వాయిదా ద్వారా నిధులు అందించినప్పటికీ నిషాద్​ కుటుంబం తమ ఇంటిని నిర్మించుకోలేకపోయిందన్నారు. పీఎం ఆవాస్​ యోజన ద్వారా ఇల్లు నిర్మాణం పూర్తయ్యే వరకు వారి వేరే చోట ఆశ్రయం కల్పిస్తామని చెప్పారు.

ఇదీ చూడండి: మరుగుదొడ్డిలోనే నివాసం.. మనవరాలే సర్వస్వం!

ఇదీ చూడండి: నరబలి కోసం బాలిక అపహరణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.