Odisha Fake Doctor: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఓ నకిలీ వైద్యుడు పశువులు ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన ఒడిశాలో జరిగింది. మయూర్‌భంజ్ జిల్లా మహులదిహ గ్రామానికి చెందిన బాధితుడు శ్రీకంఠ మహంత దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గ్రామానికి విచ్చేసిన నిందితుడు బిశ్వనాథ్ బెహరా తనని తాను వైద్యుడిగా పరిచయం చేసుకున్నాడు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసేందుకు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వచ్చానని నమ్మబలికాడు.
ఇది నమ్మిన బాధితుడు శ్రీకంఠ తన వెన్నునొప్పి సమస్య గురించి నకిలీ వైద్యుడికి తెలిపాడు. శ్రీకంఠకు వైద్యపరీక్షలు చేసిన బిశ్వజిత్ ఒకేసారి మూడు ఇంజెక్షన్లు చేశాడు. అనుమానంతో బాధితుడి కుమారుడు ఇంజెక్షన్ల గురించి ఆరా తీయగా అది పశువులకు ఇచ్చేవని తేలింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు నకిలీ వైద్యుడ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: అసెంబ్లీని ముట్టడించిన 3 లక్షల మంది డ్రైవర్లు