ETV Bharat / bharat

రష్యన్లనే బురిడీ కొట్టించిన కూలీలు.. ఫేక్​ క్రికెట్​ లీగ్స్​తో బడా స్కామ్​!

Fake Cricket League Gujarat: భారత్​లో క్రికెట్​ అంటే పడి చచ్చే అభిమానులు ఉంటారు. ఇదే అదనుగా కొందరు కేటుగాళ్లు మాత్రం దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. నకిలీ టీ-20 లీగ్​లు నిర్వహిస్తూ.. బెట్టింగ్​లతో జేబులు నింపుకుంటున్నారు. మొన్న గుజరాత్​లో ఇలాంటి ఘటన జరగ్గా.. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​ హాపుర్​లోనూ అలాంటి రాకెట్​ బయటపడింది. వీళ్లు యూట్యూబ్​లో ఫేక్​ మ్యాచ్​లతో.. లైవ్​ స్ట్రీమింగ్​ నిర్వహిస్తుండటం విశేషం.

Fake Cricket League Gujarat now fake cricket league with Russian, Pakistan link busted in UP

author img

By

Published : Jul 12, 2022, 7:17 PM IST

Fake Cricket League Gujarat: భారత్​లో క్రికెట్​కు ఉన్న క్రేజే వేరు. టీమ్​ఇండియా క్రికెట్​ ఆడుతుందంటే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా చూసేవాళ్లు కోట్లల్లో ఉంటారు. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ మొదలైనప్పటి నుంచి ఈ క్రికెట్​ పిచ్చి మరింత పెరిగింది. ఇదే అదనుగా పందెం రాయుళ్లు.. ఆన్​లైన్​ బెట్టింగ్​తో క్రికెట్​ను సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగే ఈ దందా​లో కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ఇప్పుడు ఈ వ్యసనం ముదిరి పాకానపడింది. క్రికెట్​ మ్యాచ్​లు జరగకుండానే.. బెట్టింగ్​లతో బురిడీ కొట్టించే కేటుగాళ్ల సంఖ్య పెరిగింది. నకిలీ ఆన్​లైన్​ క్రికెట్​ లీగ్స్​ నిర్వహిస్తూ రెచ్చిపోతున్నారు. గుజరాత్​, ఉత్తర్​ప్రదేశ్​లో ఇలాంటి ఫేక్​ టీ-20 క్రికెట్​ లీగ్స్​ నిర్వహిస్తున్న రెండు ముఠాలు అడ్డంగా పోలీసులకు చిక్కాయి.

గుజరాత్​లో ఇలా.. నకిలీ క్రికెట్‌ లీగ్‌ నిర్వహిస్తూ రష్యన్లనే బురిడీ కొట్టించారు కొందరు కేటుగాళ్లు. నిజం మ్యాచ్‌ల తరహాలోనే ప్రత్యక్ష ప్రసారం, స్టేడియంలో అభిమానులు కేరింతలను సెటప్‌ చేసి, ప్రముఖ కామెంటేటర్​ హర్ష బోగ్లేను మిమిక్రీ చేసే వ్యక్తిని సైతం నియమించుకున్నారు. ఈ వ్యవహారమంతా నడిపింది సైబర్‌ కేటుగాళ్లో, మోసాల్లో ఆరితేరినవారు కాదు.. గుజరాత్‌కు చెందిన చిన్న గ్రామానికి చెందిన యువకులు. లీగ్​ను క్వార్టర్‌ ఫైనల్‌ వరకు తీసుకొచ్చారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Fake Cricket League Gujarat now fake cricket league with Russian, Pakistan link busted in UP
వాద్​నగర్​లో అరెస్టైన నిందితులు

గ్రామ శివారుల్లోని కొంత భూమిని కొనుగోలు చేసి నిందితులు దాన్ని చదును చేసి క్రికెట్‌ మైదానంలా తీర్చిదిద్దారు. పిచ్‌ను తయారు చేశారు. హాలోజన్ లైటింగ్‌ను ఏర్పాటు చేసి.. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం సైతం నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన కూలీలు, యువకులతోనే జట్లు ఏర్పాటు చేసి, మ్యాచ్‌లు నిర్వహించారు. మ్యాచ్‌ కామెంట్రీ కోసం ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్ష బోగ్లేను మిమిక్రీ చేసే ఓ వ్యక్తిని నియమించుకోవడం గమనార్హం. స్టేడియంలో అభిమానులు కూర్చున్నట్లు, వారి సౌండ్ ఎఫెక్ట్‌లను సైతం అంతర్జాలం నుంచి డౌన్‌లోడ్ చేసుకొని సాక్షాత్తూ నిజం మ్యాచ్‌ జరుగుతున్నట్లుగానే జూదగాళ్లకు భ్రమ కల్పించారు.

ఈ నకిలీ లీగ్‌కు రష్యాలోని నగరాలైన మాస్కో, ట్వెర్, వొరోనెజ్ నుంచి పందేలను ఆహ్వానించారు. టెలిగ్రామ్‌ ఛానెల్‌ ద్వారా బెట్టింగ్‌ తతంగాన్ని నిర్వహించారు. ఈ ఫేక్‌ లీగ్‌ క్వార్టర్‌ ఫైనల్‌ వరకు చేరింది. సెమీఫైనల్‌కు ముందు పోలీసులకు సమాచారం అందగా.. ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అసిఫ్‌ అహ్మద్ రష్యాలో ఉన్నాడని‌.. అక్కడి నుంచే ఈ లీగ్‌, బెట్టింగ్‌ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.

యూపీలో యూట్యూబ్​లో స్ట్రీమింగ్​.. దేశ రాజధానికి 60 కిలోమీటర్ల దూరంలోని ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​లోని హాపుర్​లో ఇలాంటి ఫేక్​ క్రికెట్​ లీగ్​ నిర్వహించి అడ్డంగా దొరికారు నిందితులు. బిగ్​బాస్​ టీ-20 పంజాబ్​ లీగ్​ పేరుతో.. క్రిక్​ హీరోస్​ అనే మొబైల్​ అప్లికేషన్​లో ఆన్​లైన్ బెట్టింగ్స్​ నిర్వహించారు. ఇదంతా రష్యాలోని మాస్కో కేంద్రంగా జరిగింది. ఇద్దరు నిందితులు.. షితాబ్​ అలియా షబ్బు, రిషభ్​ను అరెస్టు చేశారు పోలీసులు.

నిందితులు షితాబ్​, రిషభ్​

పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు

ఈ లీగ్​ మాస్టర్​మైండ్​ అశోక్​ చౌదరి.. రిషభ్​కు మ్యాచ్​కు రూ. 40-50 వేల వరకు ఇచ్చేవాడని పోలీసులు వెల్లడించారు. ప్లేయర్లకు కూడా మ్యాచ్​ ఫీజులు చెల్లిస్తారని హాపుర్​ ఎస్పీ దీపక్​ భుకర్​ పేర్కొన్నారు. నిందితుల వాట్సాప్, ఫోన్​కాల్స్​ను పరిశీలించగా.. రష్యా సహా పాకిస్థాన్​ సిరీస్​ మొబైల్​ నెంబర్లు కనిపించాయని, లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి: 'ఆన్​లైన్​ బెట్టింగ్'​పై కేంద్రం సీరియస్.. ఇక అవన్నీ బంద్!

గుజరాత్‌ ముఠా ఆన్‌లైన్ బెట్టింగ్‌.. రూ. కోటికి పైగా స్వాధీనం

జోరుగా ఐపీఎల్​ బెట్టింగు... పది మంది యువకుల అరెస్ట్​...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.