దిల్లీలో బాంబు పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గాబీ అష్కెనాజీతో ఫోన్లో మాట్లాడారు భారత విదేశాంగ మంత్రి జై శంకర్. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
ఇదే ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. దిల్లీ సీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను అడిగి తెలుసుకున్నారు షా. ఈ సంఘటన తరువాత, మంత్రి దిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
దిల్లీ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి దగ్గరలో బాంబు పేలుడు సంభవించింది.
ఇదీ చూడండి: దిల్లీలో ఐఈడీ పేలుడు- ఎవరి పని?