జమ్ముకశ్మీర్ బుద్గాం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది. మరో ముష్కరుడు తప్పించుకు పారిపోయాడు. అయితే అతని గురించిన సమాచారం అందడంతో క్రూ వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి పారిపోతున్న వాహనం డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మొదటగా బుద్గాం జిల్లాలోని హరిబాగ్ మౌచ్వా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతాదళాలు, పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. ఈ పరిణామాలు ఎన్‌కౌంటర్‌కు దారితీశాయి.
ఈ ఘటనలో ఒక ఏకే47, రైఫిల్, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన ఉగ్రవాది ఏ మిలిటెంట్ గ్రూప్‌కు చెందిన వ్యక్తి అనేది ఇంకా నిర్ధరణ కాలేదు.