ETV Bharat / bharat

'భారత్​-చైనా మైత్రి పునరుద్ధరణకు 8 సూత్రాలు' - జై శంకర్ 8 సూత్రాలు

భారత్​-చైనా దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడాలంటే ఎనిమిది సూత్రాలను పాటించాలని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. 13వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ చైనా స్టడీస్ కార్యక్రమంలో వర్చువల్​గా పాల్గొన్న విదేశాంగ మంత్రి ఈ విధంగా మాట్లాడారు.

EAM Jaishankar outlines eight principles
'భారత్​-చైనా.. ఈ 8 సూత్రాలకు కట్టుబడి ఉంటే చాలు'
author img

By

Published : Jan 28, 2021, 6:42 PM IST

భారత్​-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేందుకు ఎనిమిది సూత్రాలను పాటించాలని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. ఇరు దేశాల ప్రయోజనాలకు విలువ ఇవ్వడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకపోవడం, పరస్పరం గౌరవించుకోవడం వంటివి ఉద్రిక్తతలను తగ్గించే అంశాలని తెలిపారు. లద్దాఖ్​ ఘటన అనంతరం సరిహద్దుల్లో చైనా తమ బలగాలను మోహరించడాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 13వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ చైనా స్టడీస్ కార్యక్రమంలో వర్చువల్​గా పాల్గొన్న విదేశాంగ మంత్రి ఈ విధంగా మాట్లాడారు.

సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం ఇరుదేశాలకే పరిమితం కాదన్న జైశంకర్‌... ప్రపంచ దేశాలపైనా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దశల వారీగా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఉద్రిక్తతలపై చైనా అవలంబించబోయే వైఖరిపై... ఆ దేశం నుంచి ఎలాంటి నమ్మదగ్గ వివరణ రాలేదని తెలిపారు.

8 సూత్రాలివే...

  • ఇప్పటికే కుదిరిన ఒప్పందాల పట్ల ఇరుదేశాలు నిబద్ధతతో ఉండాలి.
  • వాస్తవాధీన రేఖ వద్ద నిబంధనలను ఉల్లంఘించి యథాతథ స్థితిని మార్చే ప్రయత్నాలు చేయకూడదు.
  • సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితుల్ని నెలకొల్పడం ద్వారా రెండు దేశాల మధ్య వివిధ రంగాల అభివృద్ధి ఒప్పందాలు కుదురుతాయి.
  • బహుపాక్షిక ప్రపంచ నియమాలను అంగీకరిస్తోన్న భారత్​-చైనా... ఆసియాలో నిర్మాణాత్మక శక్తిగా ఎదగాలి.
  • ప్రతి దేశానికి భిన్నమైన ప్రయోజనాలు, ప్రాధాన్యాలు ఉంటాయి. కానీ, అవి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు.
  • శక్తిమంతమైన దేశాలుగా ఎదిగే క్రమంలో ప్రతి దేశానికి భిన్నమైన లక్ష్యాలుంటాయి. అందుకోసం వారు చేసే పనులను కాదనలేం.
  • ఇరు దేశాల మధ్య విబేధాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ, అవి పరిష్కరించుకుంటూ ముందుకెళ్లడం ముఖ్యం.
  • చైనా, భారత్​ లాంటి దేశాలు దీర్ఘకాలిక ఆలోచనా ధృక్పథంతో ముందుకెళ్లాలి.

ఈ ఎనిమిది నియమాలను సరిగ్గా అనుసరిస్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని జై శంకర్ అన్నారు. సరిహద్దు వివాదంపై చర్చలు ఇంకా జరుగుతున్నట్లు గుర్తుచేశారు.

ఇదీ చదవండి:'దేశంలో కరోనా గ్రాఫ్​ తగ్గుముఖానికి ఇదే నిదర్శనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.