Dog Birthday Party Gujarat: పెంపుడు శునకాలపై యజమానులకు ప్రేమ సహజమే. అక్కడక్కడ వీటికి పుట్టిరోజులు కూడా చేస్తుంటారు. కానీ గుజరాత్, అహ్మదాబాద్‌లోని కృష్ణానగర్‌కు చెందిన సోదరులు చిరాగ్ పటేల్, ఊర్విష్ పటేల్ మాత్రం తమ పెంపుడు శునకం 'అబ్బీ' బర్త్‌డేకు ఏకంగా రూ.7లక్షలు ఖర్చు చేశారు. కుక్క పుట్టినరోజును అంగరంగ వైభవంగా నిర్వహించారు.
శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. అయితే కొవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా ఈ వేడుక జరగడం వల్ల సోదరులతోపాటు, వారి స్నేహితుడు దివ్యేష్ మెహారియాను అరెస్ట్ చేశారు పోలీసులు.
ఈ వేడుకకు రూ. 7లక్షల వరకు ఖర్చు చేశారని పోలీసులు తెలిపారు. వేడుకలో ఎవ్వరూ.. మాస్కు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా వ్యవహరించారని పేర్కొన్నారు.
కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా గుజరాత్లో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉండటం వల్ల రాష్ట్రంలో ఇలాంటి వేడుకలకు అనుమతి లేదన్నారు పోలీసులు.
ఇదీ చూడండి: దేశంలో కరోనా ఉపద్రవం- ఒక్కరోజే 1.59 లక్షల కేసులు