ETV Bharat / bharat

పుల్వామాలో ఉగ్రదాడి.. జవాను మృతి, ఓ పౌరుడికి గాయాలు - ఉగ్రదాడిలో ఎస్​ఐ మరణం

CRPF ASI Died Pulwama Attack: భద్రతా విధుల్లో ఉన్న సీఆర్​పీఎఫ్​ జవాన్లపై ముష్కరులు కాల్పులు జరిపారు. జమ్ముకశ్మీర్​లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఏఎస్​ఐ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో మృతి చెందారు.

CRPF ASI killed in Pulwama attack
CRPF ASI killed in Pulwama attack
author img

By

Published : Jul 17, 2022, 6:34 PM IST

CRPF ASI Died Pulwama Attack: జమ్ముకశ్మీర్​.. పుల్వామా జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న సీఆర్​పీఎఫ్​ సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో సీఆర్​పీఎఫ్​ ఏఎస్​ఐ జవాన్​ వినోద్​కుమార్​ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన​ మరణించారు.
"పుల్వామా.. గంగూ క్రాసింగ్​ సమీపంలో ఉన్న యాపిల్​ తోట నుంచి ఉగ్రవాదులు.. సీఆర్​పీఎఫ్​ జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో ఏఎస్​ఐ వినోద్​కుమార్ చనిపోయారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్​ ఆపరేషన్​ జరుగుతోంది" అని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ఘటనలో ఓ పౌరుడికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

అంతకుముందు జులై 12న శ్రీనగర్‌ లాల్‌బజార్‌ చెక్‌పోస్ట్​పై ఉగ్రవాదులు దాడి చేయగా.. జమ్ముకశ్మీర్‌ పోలీస్‌ విభాగానికి చెందిన ఏఎస్‌ఐ ముష్తాక్‌ అహ్మద్ చనిపోయారు. జులై 11న పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.

ఇవీ చదవండి: చెస్​ ఒలింపియాడ్​ స్పెషల్​.. ఈ 'చదరంగం' వంతెనను చూశారా?

నదిలో 53కేజీల వెండి శివలింగం.. గ్రామస్థుల పూజలు.. పోలీస్ స్టేషన్​లో దర్శనాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.